Telugu Global
Others

మ‌నీషాను చంపి ఉరేశారన్న అనుమానాలు

క‌డ‌ప జిల్లాలోని నారాయ‌ణ క‌ళాశాల‌లో ఇటీవ‌ల అనుమానాస్ప‌ద‌ స్థితిలో విద్యార్థులు మ‌ర‌ణించిన తీరుపై వారి త‌ల్లిదండ్రులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. కడప నగరంలో ఓం శాంతినగర్‌కు చెందిన మాలేపాడు సుబ్బారావు కుమార్తె నందిని (16), సిద్ధవటం మండలం భాకరాపేట లెవెన్త్ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చవ్వా బాలకృష్ణారెడ్డి కుమార్తె మనీషా (16) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరు గ‌త సోమ‌వారం అనుమానాస్ప‌ద‌స్థితిలో ఉరివేసుకుని విగ‌త‌ జీవులుగా మారారు. ఈ ఘ‌ట‌న‌పై అనేక అనుమానాలు […]

మ‌నీషాను చంపి ఉరేశారన్న అనుమానాలు
X
క‌డ‌ప జిల్లాలోని నారాయ‌ణ క‌ళాశాల‌లో ఇటీవ‌ల అనుమానాస్ప‌ద‌ స్థితిలో విద్యార్థులు మ‌ర‌ణించిన తీరుపై వారి త‌ల్లిదండ్రులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. కడప నగరంలో ఓం శాంతినగర్‌కు చెందిన మాలేపాడు సుబ్బారావు కుమార్తె నందిని (16), సిద్ధవటం మండలం భాకరాపేట లెవెన్త్ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చవ్వా బాలకృష్ణారెడ్డి కుమార్తె మనీషా (16) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరు గ‌త సోమ‌వారం అనుమానాస్ప‌ద‌స్థితిలో ఉరివేసుకుని విగ‌త‌ జీవులుగా మారారు. ఈ ఘ‌ట‌న‌పై అనేక అనుమానాలు వ్య‌క్తంచేసినా.. యాజ‌మాన్యం అధికార పార్టీ అండ‌దండ‌ల‌తో వాస్త‌వాల‌ను తొక్కిపెడుతోంద‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు, ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు. త‌మ కూతురు ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిది కాద‌ని మ‌నీషా త‌ల్లిదండ్రులు ఆదివారం క‌డ‌ప జిల్లా సీపీఎం కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో అన్నారు. క‌ళాశాల‌లో త‌మ కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటనపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరపాలని వారు డిమాండు చేశారు. ఈ సంద‌ర్భంగా వారు యాజ‌మాన్యం, ప్ర‌భుత్వానికి కొన్ని సూటి ప్ర‌శ్న‌లు వేశారు.
1. మా కూతురు సాయంత్రంమే చ‌నిపోతే.. రాత్రి .7.30 దాకా ఎందుకు స‌మాచారం అందించ‌లేదు.
2. చ‌నిపోయింది మా క‌న్నకూతురైనా మృత‌దేహాన్ని చూసేందుకు ఎందుకు అనుమ‌తించ‌లేదు?
3. చ‌నిపోయిన మా కూతురిని చూడ‌కుండా పోలీసులు ఆపాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది?
4. చ‌నిపోయిన రోజు ఎలాంటి లేఖ‌లు లేవు. మ‌రి ఇప్పుడు అవి ఎలా పుట్టుకొచ్చాయి?
5. ఉరి వేసుకుంటే బ‌రువుకు ఫ్యాన్ రెక్క‌లు వంగి ఉండాలి, కానీ ఎందుకు అలా జ‌ర‌గ‌లేదు.
6. ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటే నోట్లో నుంచి నాలిక బ‌య‌టికి రావాలి, ఎందుకు రాలేదు?
7. ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌పుడు మ‌నీషా కాళ్లు, చేతుల‌పై క‌మిలిన గాయాలు ఎలా వ‌చ్చాయి?
8. ప్రిన్సిపాల్‌, వార్డెన్‌ల‌ను ఇంతవరకు మాకు ఎందుకు చూపించ లేదు?
First Published:  24 Aug 2015 1:58 AM GMT
Next Story