Telugu Global
Cinema & Entertainment

శ్రీకాంత్ కొడుకు చిత్రంలో ఆ అక్కినేని హీరో...

అక్కినేని నాగార్జున అప్పుడప్పుడు గెస్ట్ రోల్ లో తళుక్కున మెరుస్తుంటారనే సంగతి తెలిసిందే. మనసుకు నచ్చితే, సినిమాకి అవసరమనుకొంటే ఆయన ఏమాత్రం ఆలోచించరు. త్వరలో నాగ్‌ రెండు చిత్రాల్లో అతిథిగా సందడి చేయబోతున్నారు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయమవుతున్న ‘నిర్మలా కాన్వెంట్‌’లో నాగార్జున ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీ‌కాంత్ , ఊహా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం అని తెలుసు […]

శ్రీకాంత్ కొడుకు చిత్రంలో ఆ అక్కినేని హీరో...
X
అక్కినేని నాగార్జున అప్పుడప్పుడు గెస్ట్ రోల్ లో తళుక్కున మెరుస్తుంటారనే సంగతి తెలిసిందే. మనసుకు నచ్చితే, సినిమాకి అవసరమనుకొంటే ఆయన ఏమాత్రం ఆలోచించరు. త్వరలో నాగ్‌ రెండు చిత్రాల్లో అతిథిగా సందడి చేయబోతున్నారు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయమవుతున్న ‘నిర్మలా కాన్వెంట్‌’లో నాగార్జున ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీ‌కాంత్ , ఊహా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం అని తెలుసు కానీ.. అప్పుడే హీరోగా ప‌రిచ‌యం కావ‌డానికి సిద్దం కావ‌డంతో అభిమానులు ఆశ్చ‌ర్య ప‌డుతున్నారు. అయితే త‌మ అభిమాన న‌టుడి వార‌సుడు వ‌స్తున్నందుకు సంతోష ప‌డుతున్నారు మ‌రో వైపు.
శ్రీ‌కాంత్ త‌న‌యుడిని షైన్ సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో పి. రామ్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. శ్రీకాంత్-ఊహ దంపతులకు ముగ్గురు సంతానం. కుమారులు రోషన్, రోహన్, కుమార్తె మేధ. పెద్ద కొడుకు రోషన్ వయసు 20 సంవత్సరాల లోపే… ఇతన్ని క్యూట్ లవ్ స్టోరీ ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి పి. రామ్ మోహన్ స్వయంగా దర్శకత్వం వహించే అవకాశం ఉందినేది ఫిల్మ్ న‌ట‌ర్ టాక్.
First Published:  24 Aug 2015 12:02 AM GMT
Next Story