Telugu Global
National

ఇక ఇప్పీ నూడుల్స్ వంతు!

ప‌రిమితికి మించి ర‌సాయ‌నాలు వాడుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై నెస్లే వారి మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం ఎత్తివేయ‌క‌ముందే ఆ జాబితాలో మ‌రో ఉత్ప‌త్తి చేర‌నుంది. దేశీయ కార్పొరేట్ సంస్థ ఐటీసీ ఉత్పత్తిచేస్తున్న యిప్పీ నూడుల్స్‌లో మోతాదును మించి రసాయన పదార్థాలు వాడుతున్న ట్లు ఉత్తరప్రదేశ్ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అధికారులు నిర్ధారించారు. అలీగఢ్‌లోని షాపింగ్‌మాల్ నుంచి జప్తుచేసి పరీక్షించగా మోతాదును మించి రసాయనాలు వాడారని తేలిందని ఎఫ్‌డీఏ అలీగఢ్ డివిజన్ చీఫ్ చందన్ పాండే తెలిపారు. ఐటీసీ […]

ఇక ఇప్పీ నూడుల్స్ వంతు!
X
ప‌రిమితికి మించి ర‌సాయ‌నాలు వాడుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై నెస్లే వారి మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం ఎత్తివేయ‌క‌ముందే ఆ జాబితాలో మ‌రో ఉత్ప‌త్తి చేర‌నుంది. దేశీయ కార్పొరేట్ సంస్థ ఐటీసీ ఉత్పత్తిచేస్తున్న యిప్పీ నూడుల్స్‌లో మోతాదును మించి రసాయన పదార్థాలు వాడుతున్న ట్లు ఉత్తరప్రదేశ్ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అధికారులు నిర్ధారించారు. అలీగఢ్‌లోని షాపింగ్‌మాల్ నుంచి జప్తుచేసి పరీక్షించగా మోతాదును మించి రసాయనాలు వాడారని తేలిందని ఎఫ్‌డీఏ అలీగఢ్ డివిజన్ చీఫ్ చందన్ పాండే తెలిపారు. ఐటీసీ యిప్పీ నూడుల్స్‌లో రసాయనాల వాడకం 1 పీపీఎంలోపే ఉండాలి. కానీ యిప్పీ నూడుల్స్‌లో 1.057 పీపీఎం వాడుతున్నట్లు తేలిందన్నారు. వీటిని తింటే పిల్లల ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. ఐటీసీపై కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ లక్నోలోని ఎఫ్‌డీఏ చీఫ్ కమిషనర్‌కు పరీక్షల నివేదిక పంపామన్నారు. కేసు నమోదు ప్రక్రియ కొన్నివారాల పాటు సాగుతుందన్నారు.
First Published:  24 Aug 2015 12:01 AM GMT
Next Story