Telugu Global
Others

ఆందోళ‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లుతున్న రాజ‌ధాని ప్రాంతం

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని కోసం భూసేక‌ర‌ణ చ‌ట్టాన్ని ప్ర‌యోగించ‌డానికి వ్య‌తిరేకంగా రాజ‌ధాని ప్రాంతంలో ఆందోళ‌న‌లు రోజురోజుకూ తీవ్రత‌ర‌మ‌వుతున్నాయి. ధ‌ర్నాలు, రాస్తారోకోల‌తో రాజ‌ధాని ప్రాంతం ద‌ద్ద‌రిల్లుతోంది. సీపీఎం, సీపీఐ ఈ ఆందోళ‌న‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా కొన్ని చోట్ల స్వ‌చ్ఛందంగా రైతులు, గ్రామ‌స్తులే ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఈ ఆందోళ‌న‌ల‌న్నీ మీడియాలో అంత‌గా క‌వ‌ర్ కాకుండా ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు వ‌హిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా గ్రామకంఠాలు, భూసేకరణ ప్ర‌య‌త్నాల‌పై సిపిఎం ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. […]

ఆందోళ‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లుతున్న రాజ‌ధాని ప్రాంతం
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని కోసం భూసేక‌ర‌ణ చ‌ట్టాన్ని ప్ర‌యోగించ‌డానికి వ్య‌తిరేకంగా రాజ‌ధాని ప్రాంతంలో ఆందోళ‌న‌లు రోజురోజుకూ తీవ్రత‌ర‌మ‌వుతున్నాయి. ధ‌ర్నాలు, రాస్తారోకోల‌తో రాజ‌ధాని ప్రాంతం ద‌ద్ద‌రిల్లుతోంది. సీపీఎం, సీపీఐ ఈ ఆందోళ‌న‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా కొన్ని చోట్ల స్వ‌చ్ఛందంగా రైతులు, గ్రామ‌స్తులే ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఈ ఆందోళ‌న‌ల‌న్నీ మీడియాలో అంత‌గా క‌వ‌ర్ కాకుండా ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు వ‌హిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా గ్రామకంఠాలు, భూసేకరణ ప్ర‌య‌త్నాల‌పై సిపిఎం ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని ఉండవల్లి, నవులూరుల్లోని సీఆర్‌డీఏ కార్యాలయాలను సోమ‌వారం స్థానికులు ముట్టడించారు. తుళ్లూరు మండలం దొండపాడులోని సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయానికి రాజకీయాలకతీతంగా స్వ‌చ్ఛందంగా వ‌చ్చిన‌ రైతులు తాళాలేశారు. గ్రామకంఠాల పేరుతో గ్రామాలను ఖాళీ చేయాలనే కుట్ర జరుగుతోందని నినదిస్తూ అధికారులను ఘెరావ్‌ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామాల‌ను ఖాళీ చేయించేందుకు ప్ర‌భుత్వం కుట్ర‌ప‌నున్న‌తోంద‌ని ఆందోళ‌న‌కారులు విమ‌ర్శించారు. తొలుత గ్రామకంఠంలోని కొన్ని ఇళ్ళను తొలగించి ఆ తరువాత గ్రామాన్ని ఖాళీ చేయించడానికి చేస్తున్న ప్రయత్నాలు దానిలో భాగమేన‌ని గ్రామ‌స్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మధ్యాహ్నం నిడమర్రులో బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ స్థానిక సీఆర్‌డీఏ కార్యాలయాన్ని వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ముట్టడించారు. సిపిఎం ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. చంద్రబాబు ప్రభుత్వం భూ దాహంతో భూ బకాసురుడిలా వ్యవహరిస్తోందని సీఆర్‌డీఏ ప్రాంత సీపీఎం క‌న్వీన‌ర్ సీహెచ్‌బాబూరావు మండిపడ్డారు. నిన్నటి వరకూ భూపూలింగ్‌ అన్నారని, ఆ తరువాత గ్రామాల పూలింగ్‌కు దిగారని, రాబోయే కాలంలో శ్మశానాల పూలింగ్‌నూ మొదలు పెడ‌తార‌ని విమ‌ర్శించారు. మరోవైపు తుళ్లూరు మండలం దొండపాడులోని సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయానికి రాజకీయాలకతీతంగా రైతులు కదిలొచ్చి తాళాలేశారు. గ్రామకంఠాల సమస్యను పరిష్కరించే వరకూ తామూ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. డిప్యూటీ కలెక్టర్‌ ఝాన్సీలక్ష్మిని నిలదీశారు. భూ సేకరణను వ్యతిరేకరిస్తూ తుళ్లూరులో సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వ‌ర్యంలో ధర్నా జరిగింది.
First Published:  24 Aug 2015 9:06 PM GMT
Next Story