Telugu Global
Others

విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై హైకోర్టు స్పంద‌న‌

ఏపీలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై హైకోర్టు స్పందించింది. వీటిపై నివేదిక ఇవ్వాల‌ని ఏపీ మాధ్య‌మిక విద్యాశాఖ‌ను ఆదేశించింది. ఈ విద్యాసంవ‌త్స‌రంలో ప్రైవేటు క‌ళాశాల‌ల్లో 11 మంది విద్యార్థులు చ‌నిపోయారు. వీటిపై ఫోరం ఫ‌ర్ బెట‌ర్ విక్ర‌మ సింహ‌పురి త‌ర‌ఫున హైకోర్టులో వ్యాజ్యం దాఖ‌లైంది. తీవ్ర‌మైన ఒత్తిడికి గురిచేయ‌డం వ‌ల్లే వ‌స‌తి గృహాల్లో విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని పిటిష‌న్ కోర్టుకు నివేదించారు. దీనిపై హైకోర్టు స్పందించింది. ఏడాదిన్న‌ర‌కాలంలోనే ఏపీలో 11 మంది విద్యార్థులు వ‌స‌తి గృహాల్లో ఒత్తిడి […]

విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై హైకోర్టు స్పంద‌న‌
X
ఏపీలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై హైకోర్టు స్పందించింది. వీటిపై నివేదిక ఇవ్వాల‌ని ఏపీ మాధ్య‌మిక విద్యాశాఖ‌ను ఆదేశించింది. ఈ విద్యాసంవ‌త్స‌రంలో ప్రైవేటు క‌ళాశాల‌ల్లో 11 మంది విద్యార్థులు చ‌నిపోయారు. వీటిపై ఫోరం ఫ‌ర్ బెట‌ర్ విక్ర‌మ సింహ‌పురి త‌ర‌ఫున హైకోర్టులో వ్యాజ్యం దాఖ‌లైంది. తీవ్ర‌మైన ఒత్తిడికి గురిచేయ‌డం వ‌ల్లే వ‌స‌తి గృహాల్లో విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని పిటిష‌న్ కోర్టుకు నివేదించారు. దీనిపై హైకోర్టు స్పందించింది. ఏడాదిన్న‌ర‌కాలంలోనే ఏపీలో 11 మంది విద్యార్థులు వ‌స‌తి గృహాల్లో ఒత్తిడి భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. తాజాగా క‌డ‌ప‌జిల్లాలో నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లో ఇద్ద‌రు విద్యార్థుల ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌ను కూడా న్యాయ‌స్థానం దృష్టికి తీసుకువ‌చ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఏపీ మాధ్య‌విక విద్యాధికారుల‌ను ఆదేశించింది.
First Published:  24 Aug 2015 11:45 PM GMT
Next Story