Telugu Global
NEWS

రిలీవైన విద్యుత్‌ ఉద్యోగుల సమస్యపై హైకోర్టు సీరియస్‌

తెలంగాణ రిలీవ్‌ చేసిన ఉద్యోగుల సమస్యను వెంటనే పరిష్కరించాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యుత్‌ ఉద్యోగుల రిలీవ్‌ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విధుల నుంచి రిలీవ్‌ అయ్యి మూడు నెలలుగా ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా ఉంటే సమస్య ఎందుకు కొలిక్కి తీసుకురావడం లేదని ప్రశ్నించింది. సెప్టెంబర్‌ 3వ తేదీలోగా సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులను పిలిచి సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలని సూచించింది. ఈ విషయంలో ఒక్క నిమషం […]

రిలీవైన విద్యుత్‌ ఉద్యోగుల సమస్యపై హైకోర్టు సీరియస్‌
X
తెలంగాణ రిలీవ్‌ చేసిన ఉద్యోగుల సమస్యను వెంటనే పరిష్కరించాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యుత్‌ ఉద్యోగుల రిలీవ్‌ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విధుల నుంచి రిలీవ్‌ అయ్యి మూడు నెలలుగా ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా ఉంటే సమస్య ఎందుకు కొలిక్కి తీసుకురావడం లేదని ప్రశ్నించింది. సెప్టెంబర్‌ 3వ తేదీలోగా సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులను పిలిచి సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలని సూచించింది. ఈ విషయంలో ఒక్క నిమషం కూడా ఆలస్యం చేయవద్దని హెచ్చరించింది.
First Published:  25 Aug 2015 3:30 AM GMT
Next Story