Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 185

తేడా గజల్‌కు, లెక్చర్‌కు తేడా ఏమిటి? గర్ల్‌ఫ్రెండ్‌ మాట్లాడిన ప్రతి మాటా గజల్‌! భార్య మాట్లాడిన ప్రతి మాటా లెక్చర్‌! ——————————————————————————- తప్పకుండా వెంగళప్పతో అతని గర్ల్‌ఫ్రెండ్‌ అంది – “మన ఎంగేజ్‌మెంట్‌ రోజు నువ్వు నాకు తప్పక రింగివ్వాలి?” “అలాగే నీ సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఇవ్వు” అన్నాడు వెంగళప్ప. ——————————————————————————- సలహా తల్లి: హలో! డాక్టర్‌గారా! మా అబ్బాయి ఒక ఇంక్‌ బాటిల్‌ తాగేశాడు డాక్టర్‌: అలాగా! నేను ఒక గంటలో వస్తాను. తల్లి: గంటసేపా! […]

తేడా
గజల్‌కు, లెక్చర్‌కు తేడా ఏమిటి?
గర్ల్‌ఫ్రెండ్‌ మాట్లాడిన ప్రతి మాటా గజల్‌!
భార్య మాట్లాడిన ప్రతి మాటా లెక్చర్‌!
——————————————————————————-
తప్పకుండా
వెంగళప్పతో అతని గర్ల్‌ఫ్రెండ్‌ అంది – “మన ఎంగేజ్‌మెంట్‌ రోజు నువ్వు నాకు తప్పక రింగివ్వాలి?”
“అలాగే నీ సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఇవ్వు” అన్నాడు వెంగళప్ప.
——————————————————————————-
సలహా
తల్లి: హలో! డాక్టర్‌గారా! మా అబ్బాయి ఒక ఇంక్‌ బాటిల్‌ తాగేశాడు
డాక్టర్‌: అలాగా! నేను ఒక గంటలో వస్తాను.
తల్లి: గంటసేపా! అంతవరకూ ఏం చెయ్యమంటారు?
డాక్టర్‌: పెన్సిల్‌తో రాసుకోమనండి
——————————————————————————-
అతితెలివి
టీచర్‌: నాలుగు కాళ్ల జంతువుకు ఒక ఉదాహరణ ఇవ్వు
విద్యార్థి: గుర్రం
టీచర్‌: వెరీగుడ్‌! ఇంకో ఉదాహరణ?
విద్యార్థి: ఇంకో గుర్రం!

First Published:  24 Aug 2015 1:03 PM GMT
Next Story