Telugu Global
Cinema & Entertainment

రకుల్ పై రుసరుసలాడుతున్న సమంత, కాజల్...

త్వరలోనే బ్రహ్మోత్సవం సినిమాలో నటించడానికి సిద్ధమౌతున్నాడు మహేష్ బాబు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు మొదట రకుల్ ప్రీత్ సింగ్ నే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ బిజీ షెడ్యూల్స్ తో తీరికలేకుండా ఉన్న రకుల్, అప్పట్లో కాల్షీట్లు కేటాయించలేకపోయింది. దీంతో సమంత, కాజల్, ప్రణీతలను బ్రహ్మోత్సవం కోసం హీరోయిన్లుగా బుక్ చేసుకున్నారు. అయితే సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ కావడంతో సెట్స్ పైకి రావడానికి ఆలస్యమైంది. ఈ గ్యాప్ లో రకుల్ ప్రీత్ […]

రకుల్ పై రుసరుసలాడుతున్న సమంత, కాజల్...
X
త్వరలోనే బ్రహ్మోత్సవం సినిమాలో నటించడానికి సిద్ధమౌతున్నాడు మహేష్ బాబు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు మొదట రకుల్ ప్రీత్ సింగ్ నే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ బిజీ షెడ్యూల్స్ తో తీరికలేకుండా ఉన్న రకుల్, అప్పట్లో కాల్షీట్లు కేటాయించలేకపోయింది. దీంతో సమంత, కాజల్, ప్రణీతలను బ్రహ్మోత్సవం కోసం హీరోయిన్లుగా బుక్ చేసుకున్నారు. అయితే సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ కావడంతో సెట్స్ పైకి రావడానికి ఆలస్యమైంది. ఈ గ్యాప్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఖాళీ అయిపోయింది. దీంతో ఆమె మరోసారి నిర్మాతలను, దర్శకుడ్ని అప్రోచ్ అయింది. ప్రస్తుతం తను ఖాళీగానే ఉన్నానని, కుదిరితే బ్రహ్మోత్సవం ప్రాజెక్ట్ లోకి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తోంది. టాలీవుడ్ లో మాంఛి ఊపుమీదున్న రకుల్ ను తీసుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి.. బ్రహ్మోత్సవం ప్రాజెక్ట్ లోకి రకుల్ ను తీసుకోవడానికే ఫిక్స్ అయ్యారు నిర్మాతలు. అయితే రకుల్ రాకతో ఎవరికి చెక్ పడుతోందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. సమంత, కాజల్ లో ఒకర్ని తప్పించి ఆ స్థానాన్ని రకుల్ కు కట్టబెడతారనే రూమర్లు నడుస్తున్నాయి. ప్రణీత పాత్రను మాత్రం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే.. ఆ క్యారెక్టర్ కు అంత ప్రాధాన్యం లేదని తెలుస్తోంది.
First Published:  24 Aug 2015 7:00 PM GMT
Next Story