Telugu Global
Others

విజయవాడ మెట్రో రైల్‌కు కేంద్రం రెడ్‌సిగ్నల్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన విజయవాడ మెట్రో రైలు కొండెక్కింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పరిశీలించిన కేంద్రం మెట్రోరైల్‌ ఏర్పాటుకు విజయవాడ పనికిరాదని తేల్చి చెప్పింది. మెట్రోరైల్‌ ఏర్పాటుకు ఉండాల్సిన లక్షణాలేవీ విజయవాడకు లేవని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదిక కూడా ఈ విషయమే ధ్రవపరిచిందని స్పష్టం చేసింది. అందుచేత మెట్రోరైల్‌కు కేంద్రం నుంచి సాయం పొందడానికి కావలసిన అర్హతలు […]

విజయవాడ మెట్రో రైల్‌కు కేంద్రం రెడ్‌సిగ్నల్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన విజయవాడ మెట్రో రైలు కొండెక్కింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పరిశీలించిన కేంద్రం మెట్రోరైల్‌ ఏర్పాటుకు విజయవాడ పనికిరాదని తేల్చి చెప్పింది. మెట్రోరైల్‌ ఏర్పాటుకు ఉండాల్సిన లక్షణాలేవీ విజయవాడకు లేవని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదిక కూడా ఈ విషయమే ధ్రవపరిచిందని స్పష్టం చేసింది. అందుచేత మెట్రోరైల్‌కు కేంద్రం నుంచి సాయం పొందడానికి కావలసిన అర్హతలు లేవని ప్రకటించింది. అయినా కేంద్రం నుంచి 20 శాతం మాత్రమే సాయం అందుతుందని, ఇది కూడా భూ సేకరణ నిధులతో సంబంధం లేనిదని వివరించింది. నిజానికి మెట్రోరైల్‌ ప్రాజెక్టు చేపట్టాలంటే నగర జనాభా 20 లక్షలుండాలని, డీపీఆర్‌ ప్రకారం విజయవాడ జనాభా పది లక్షలు మాత్రమేనని ప్రకటించింది. అలాగే 2019-20 నాటికి పది లక్షల మంది ప్రయాణించగలిగేలా విజయవాడ ఉండాలని, డీపీఆర్‌ ప్రకారం ఇది 3.5 లక్షలేనని తెలిపింది. డీపీఆర్‌లో భద్రత, ప్రకృతి వైఫరీత్యాల ప్రభావం, మల్లీమోడల్‌ రంగాల్లో ఖర్చులను ప్రస్తావించలేదని ఎత్తి చూపింది. నిధుల సేకరణకు పన్నులు, సెస్‌లు విధించే అంశాల్ని కూడా తెలియజేయలేదని కేంద్రం వేలెత్తిచూపింది. ఇవన్నీ చూస్తే రాష్ట్రానికి ఆర్ధిక వ్యవహారాల్లో నిలకడ లేదనే విషయం స్పష్టమవుతోందని పేర్కొంది. ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వానికి నెలరోజుల క్రితమే కేంద్రం లేఖ పంపించినప్పటికీ జవాబు ఏమి ఇవ్వాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోయిందని తెలుస్తోంది. మొత్తం మీద విజయవాడకు మెట్రో రైల్‌ ప్రస్తుతం కలగానే మిగిలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

First Published:  25 Aug 2015 10:40 AM GMT
Next Story