Telugu Global
Cinema & Entertainment

ఈనెల 29 నుంచి బాలయ్య మూవీ

నందమూరి నటసింహం బాలకృష్ణ 99వ సినిమాపై అందరి దృష్టి ఉంది. వీలైనంత తొందరగా ఈ సినిమా పూర్తయితే వందో సినిమా వస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఫ్యాన్స్ ఆరాటానికి తగ్గట్టే బాలయ్య బల్క్ గా కాల్షీట్లు కేటాయించాడు. ఈనెల 29 నుంచి ఏకథాటిగా సినిమా షూటింగ్ జరపాలని నిర్ణయించుకున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య 99వ సినిమా చాన్నాళ్ల కిందటే ప్రారంభమైంది. అయితే పొలిటికల్ గా బాలయ్య బిజీగా ఉండడం వల్ల సినిమా సెట్స్ పైకి రావడానికి ఆలస్యమైంది. హిందూపురంలో […]

ఈనెల 29 నుంచి బాలయ్య మూవీ
X
నందమూరి నటసింహం బాలకృష్ణ 99వ సినిమాపై అందరి దృష్టి ఉంది. వీలైనంత తొందరగా ఈ సినిమా పూర్తయితే వందో సినిమా వస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఫ్యాన్స్ ఆరాటానికి తగ్గట్టే బాలయ్య బల్క్ గా కాల్షీట్లు కేటాయించాడు. ఈనెల 29 నుంచి ఏకథాటిగా సినిమా షూటింగ్ జరపాలని నిర్ణయించుకున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య 99వ సినిమా చాన్నాళ్ల కిందటే ప్రారంభమైంది. అయితే పొలిటికల్ గా బాలయ్య బిజీగా ఉండడం వల్ల సినిమా సెట్స్ పైకి రావడానికి ఆలస్యమైంది. హిందూపురంలో ప్రజాదర్బార్ నిర్వహించడంతో పాటు.. క్యాన్సర్ హాస్పిటల్ కు సంబంధించిన పనులను కూడా ఓ కొలిక్కి తీసుకొచ్చారు బాలయ్య. ఇప్పుడు తన 99వ సినిమా డిక్టేటర్ కు పూర్తిస్థాయిలో కాల్షీట్లు కేటాయించారు. ఈ సినిమా షూటింగ్ ను ఏకథాటిగా పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. సినిమాలో బాలయ్య సరసన తొలిసారిగా అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కోసం వేట మొదలైంది. సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రాబోతున్న డిక్టేటర్ సినిమాలో బాలయ్య ను సరికొత్తగా ప్రజెంట్ చేసేందుకు బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టులను రప్పిస్తున్నారు.
First Published:  25 Aug 2015 7:03 PM GMT
Next Story