Telugu Global
Others

వ‌న్‌ర్యాంకు వ‌న్ పెన్ష‌న్‌పై 28న ప్ర‌క‌ట‌న‌!

మాజీ సైనికుల‌కు శుభ‌వార్త‌! వ‌న్‌ర్యాంకు వ‌న్ పెన్ష‌న్‌(ఓర్ ఓపీ)   అమ‌లు చేయాల‌ని ఉద్య‌మ‌బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు కేంద్రంపై ఒత్తిడి పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. 1965లో పాకిస్తాన్‌తో జ‌రిగిన యుద్ధంలో విజ‌యం సాధించి 50 ఏళ్లు పూర్త‌వనున్నాయి. ఆ సంద‌ర్భంగా ఆగ‌స్టు 28న ఓర్ ఓపీపై స్వయంగా ప్ర‌ధాన‌మంత్రే ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. హోదా సంబంధం లేకుండా మాజీ సైనికులంద‌రికీ ఒకే పెన్ష‌న్‌పై అమ‌లు చేయాల‌ని మాజీ […]

వ‌న్‌ర్యాంకు వ‌న్ పెన్ష‌న్‌పై 28న ప్ర‌క‌ట‌న‌!
X
మాజీ సైనికుల‌కు శుభ‌వార్త‌! వ‌న్‌ర్యాంకు వ‌న్ పెన్ష‌న్‌(ఓర్ ఓపీ) అమ‌లు చేయాల‌ని ఉద్య‌మ‌బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు కేంద్రంపై ఒత్తిడి పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. 1965లో పాకిస్తాన్‌తో జ‌రిగిన యుద్ధంలో విజ‌యం సాధించి 50 ఏళ్లు పూర్త‌వనున్నాయి. ఆ సంద‌ర్భంగా ఆగ‌స్టు 28న ఓర్ ఓపీపై స్వయంగా ప్ర‌ధాన‌మంత్రే ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. హోదా సంబంధం లేకుండా మాజీ సైనికులంద‌రికీ ఒకే పెన్ష‌న్‌పై అమ‌లు చేయాల‌ని మాజీ సైనికులు కొంత‌కాలంగా పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై మాజీ సైనికులు క‌ల్న‌ల్ పుష్పేంద‌ర్ సింగ్‌, హ‌వ‌ల్దార్ మేజ‌ర్ సింగ్‌, హ‌వ‌ల్దార్ అశోక్ చౌహాన్‌లు ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం పుష్పేంద‌ర్ సింగ్, మంగ‌ళ‌వారం మేజ‌ర్‌సింగ్ ఆరోగ్యం క్షీణించ‌డంతో వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ వారు దీక్ష కొన‌సాగిస్తున్నారు. ఈ విష‌యంలో ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న చేసేదాకా త‌మ దీక్ష ఆగ‌దని స్ప‌ష్టం చేస్తున్నారు. ఇప్ప‌టికే పుష్పేంద‌ర్ సింగ్ 1965 పాకిస్తాన్ యుద్ధం విజ‌యోత్స‌వాల‌లో పాల్గొన‌కూడ‌ద‌ని పిలుపునిచ్చారు. ఓర్ ఓపీ అమ‌లు కోసం దేశంలో 22 ల‌క్ష‌ల మంది మాజీ సైనికులు, 6 ల‌క్ష‌ల మంది అమ‌ర సైనికుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ప్ర‌స్తుతం పే క‌మిష‌న్ ఆధారంగా చెల్లింపులు చేస్తున్నారు.
First Published:  25 Aug 2015 11:46 PM GMT
Next Story