Telugu Global
Cinema & Entertainment

ప్రతి పండగను క్యాష్ చేసుకుంటున్న కంచె

కంచె సినిమాకు సంబంధించి మేకర్స్ విభిన్నంగా ప్రమోషన్ షురూ చేశారు. ఏ పండగను మిస్ చేసుకోకుండా సినిమాతో లింక్ పెట్టి సెలబ్రేట్ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్  జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆగస్ట్ 15 కానుకగా విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్ట్ 22న మరిన్ని పోస్టర్లు రిలీజ్ చేసి ప్రమోషన్ కొట్టేశారు. తాజాగా ఇప్పుడు పవన్ కల్యాణ్ […]

ప్రతి పండగను క్యాష్ చేసుకుంటున్న కంచె
X
కంచె సినిమాకు సంబంధించి మేకర్స్ విభిన్నంగా ప్రమోషన్ షురూ చేశారు. ఏ పండగను మిస్ చేసుకోకుండా సినిమాతో లింక్ పెట్టి సెలబ్రేట్ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆగస్ట్ 15 కానుకగా విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్ట్ 22న మరిన్ని పోస్టర్లు రిలీజ్ చేసి ప్రమోషన్ కొట్టేశారు. తాజాగా ఇప్పుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజును టార్గెట్ చేశాడు కంచె హీరో వరుణ్ తేజ. సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే ను దృష్టిలో పెట్టుకొని ఒకరోజు ముందుగానే కంచె సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రయిలర్ విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. అలా చేయడం వల్ల సినిమాకు మరింత ప్రచారం వస్తుందని భావిస్తున్నారు. థియేట్రికల్ ట్రయిలర్ విడుదలైన తర్వాత అదే నెల 12న ఆడియో ను విడుదల చేసి, మరో పండగ గాంధీ జయంతి నాడు అంటే అక్టోబర్ 2న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇలా ఏ ఒక్క పండగను మిస్ అవ్వకుండా సెలబ్రేట్ చేసుకుంటోంది కంచె టీం.
First Published:  25 Aug 2015 7:05 PM GMT
Next Story