Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్-నితిన్ సినిమా పక్కా అయింది

ఎట్టకేలకు తన తాజా సినిమాకు పక్కా చేశాడు త్రివిక్రమ్. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ స్టార్ డైరక్టర్ ఫైనల్ గా నితిన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. నిజానికి త్రివిక్రమ్ తో కలిసి వర్క్ చేసేందుకు చాలామంది స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్, బన్నీ, చెర్రీ, మహేష్, పవన్ లాంటి హీరోలంతా బిజీగా ఉండడంతో త్రివిక్రమ్.. నితిన్ కే ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. తాజా సమాచారం […]

త్రివిక్రమ్-నితిన్ సినిమా పక్కా అయింది
X
ఎట్టకేలకు తన తాజా సినిమాకు పక్కా చేశాడు త్రివిక్రమ్. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ స్టార్ డైరక్టర్ ఫైనల్ గా నితిన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. నిజానికి త్రివిక్రమ్ తో కలిసి వర్క్ చేసేందుకు చాలామంది స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్, బన్నీ, చెర్రీ, మహేష్, పవన్ లాంటి హీరోలంతా బిజీగా ఉండడంతో త్రివిక్రమ్.. నితిన్ కే ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ గ్యాప్ లో ఎన్నాళ్ల నుంచో ఆగిపోయిన కొరియర్ బాయ్ కల్యాణ్ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు నితిన్. సెప్టెంబర్ 11న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. మరోవైపు నితిన్ సినిమాతో ఓ ప్రయోగానికి సిద్ధమయ్యాడు త్రివిక్రమ్. ప్రస్తుతం తీస్తున్న మసాలా సినిమాలకు భిన్నంగా తన పాత పద్దతిలో పక్కా కథతో, మంచి డైలాగులతో హృదయానికి హత్తుకునేలా సినిమా తీయాలనుకుంటున్నాడు. అందుకే కథలో ఎన్నో మార్పులు చేశాడు. మరి.. త్రివిక్రమ్ మూవీలో నితిన్ ఎలా కనిపిస్తాడో తెలియాలంటే ఓ 6 నెలలు ఆగాల్సిందే.
First Published:  25 Aug 2015 7:04 PM GMT
Next Story