Telugu Global
Others

లైవ్‌లో ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టుల కాల్చివేత‌

అమెరికాలో తుపాకి తూటాల‌కు ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టులు బ‌ల‌య్యారు. లైవ్ టెలికాస్ట్ జ‌రుగుతుండ‌గానే దుండ‌గులు వారిని తుపాకుల‌తో కాల్చిప‌డేశారు. లైవ్ క‌వ‌రేజీ కావ‌డంతో ఆ దృశ్యాల‌న్నీ రికార్డ‌య్యాయి. వివ‌రాలు..  ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నిర్వహిస్తున్న డబ్ల్యూబీజే-7 టెలివిజన్ ప్రతినిధులపై ఆగంతకులు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. వర్జీనియాలో బుధవారం ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. ఈ దుర్ఘటనలో రిపోర్టర్ అలిసన్ పార్కర్ (24), కెమెరామెన్ ఆడం వార్డ్ (27) మృత్యువాత పడ్డారని టెలివిజన్ మేనేజర్ […]

లైవ్‌లో ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టుల కాల్చివేత‌
X
అమెరికాలో తుపాకి తూటాల‌కు ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టులు బ‌ల‌య్యారు. లైవ్ టెలికాస్ట్ జ‌రుగుతుండ‌గానే దుండ‌గులు వారిని తుపాకుల‌తో కాల్చిప‌డేశారు. లైవ్ క‌వ‌రేజీ కావ‌డంతో ఆ దృశ్యాల‌న్నీ రికార్డ‌య్యాయి. వివ‌రాలు.. ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నిర్వహిస్తున్న డబ్ల్యూబీజే-7 టెలివిజన్ ప్రతినిధులపై ఆగంతకులు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. వర్జీనియాలో బుధవారం ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. ఈ దుర్ఘటనలో రిపోర్టర్ అలిసన్ పార్కర్ (24), కెమెరామెన్ ఆడం వార్డ్ (27) మృత్యువాత పడ్డారని టెలివిజన్ మేనేజర్ జెఫరీ ఏ మార్క్ తెలిపారు. బెడ్‌ఫోర్డ్ కౌంటీలో ఉన్న బ్రిడ్జ్‌వాటర్ ప్లాజా, ఓ షాపింగ్, రిక్రియేషన్ ప్లాజాలో టూరిజానికి సంబంధించిన కార్యక్రమాన్ని చిత్రీకరిస్తుండగా ఆగంతకులు కాల్పులు జరిపినట్లు జెఫరీ తెలిపారు. కాల్పులకు బాధ్యులెవరో.. ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డారో అనే విషయంపై ఇంకా స్పష్టత లభించలేదన్నారు. మృతులిద్దరికి ఈ మధ్యనే నిశ్చితార్థం జరిగింది. పెండ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో టెలివిజన్ సంస్థ సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. కాల్పుల సమయంలో కింద పడిన కెమెరాలో నిందితుల‌కు సంబంధించిన అస్పష్టమైన చిత్రాలు రికార్డయ్యాయి. వారి కోసం పోలీసులు వేట మొద‌లుపెట్టారు.
First Published:  26 Aug 2015 11:02 PM GMT
Next Story