భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత

ఆదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూరులో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. 170 జిలెటిన్‌స్టిక్స్, 30 డిటోనేటర్లు, 528 మీటర్ల తీగ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు నిందితులను చెన్నూరు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ పేలుడు పదార్థాల వెనుక ఏ శక్తులున్నాయో ఆరా తీస్తున్నారు. నక్సల్స్‌ కదలికలు పెరుగుతున్న దృష్ట్యా ఆ వైపు కూడా దృష్టి సారించి విచారణ జరుపుతున్నారు.