Telugu Global
Others

జీఎస్‌ఎల్వీ డి-6 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్‌వి డి-6 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. 2117 కిలోల బరువున్న డి-6 రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా జీఎస్‌ఎల్వీ తీసుకెళ్ళగలిగింది.  దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 29 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం దీన్ని ప్రయోగించారు. రక్షణ, విమాన, అంతరిక్ష రంగాలకు వ్యూహాత్మక సమచారం అందించనుంది. జీశాట్‌-6ను ఇది కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. జీఎస్‌ఎల్వీ డి-6 ఇస్రో తయారు చేసిన 25వ సమాచార ఉపగ్రహం అని చెబుతున్నారు. జీశాట్‌ 6లో ఆరు డయామీటర్ల […]

జీఎస్‌ఎల్వీ డి-6 ప్రయోగం విజయవంతం
X
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్‌వి డి-6 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. 2117 కిలోల బరువున్న డి-6 రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా జీఎస్‌ఎల్వీ తీసుకెళ్ళగలిగింది. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 29 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం దీన్ని ప్రయోగించారు. రక్షణ, విమాన, అంతరిక్ష రంగాలకు వ్యూహాత్మక సమచారం అందించనుంది. జీశాట్‌-6ను ఇది కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. జీఎస్‌ఎల్వీ డి-6 ఇస్రో తయారు చేసిన 25వ సమాచార ఉపగ్రహం అని చెబుతున్నారు. జీశాట్‌ 6లో ఆరు డయామీటర్ల యాంటినాను శాస్త్రవేత్తలు అమర్చారు. ఇది విజయవంతమైతే దేశ సమాచార వ్యవస్థలో ట్రాన్స్‌పాండర్ల కొరత తీరనుంది. ఇందులో 10 ఎస్‌బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లను అమర్చారు. అంతేకాకుండా డిజిటల్‌ మల్టీ మీడియా సేవలు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇది తొమ్మిదేళ్ళపాటు సేవలందిస్తుంది. ఇది విజయవంతమైతే హ్యోమగాముల్ని నేరుగా భారత్‌ నుంచే పంపించే అవకాశం కలుగుతుందని ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్‌ రఘునందన్‌ తెలిపారు.
అందరి శ్రమ ఫలించింది: ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ-డీ6 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సహాలు వెల్లివిరిశాయి. ప్రయోగం విజయవంతమైన వెంటనే ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రయోగం విజయవంతమైనందుకు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఉపగ్రహ ప్రయోగం కోసం తమ శాస్త్రవేత్తలు పడిన శ్రమ ఫలించిందని ఆనందంతో తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు సాధించబోతున్నామని వ్యాఖ్యానించారు. జీఎస్‌ఎల్వీ-డీ6లో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేశాయని అన్నారు.
First Published:  27 Aug 2015 6:45 AM GMT
Next Story