Telugu Global
NEWS

ఇక తెలంగాణలో రోగుల నుంచి లగ్జరీ టాక్స్‌!

తెలంగాణ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఏ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా రోగుల నుంచి లగ్జరీ పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవోకూడా జారీ చేసింది. ఇప్పటివరకు కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన లగ్జరీ ట్యాక్స్… ఇక నిమ్స్‌ వంటి ఆసుపత్రులకూ వర్తించనుంది. కొత్త జీవో ప్రకారం రాష్ట్రంలో ఏ ఆసుపత్రి అయినా రోగికి కేటాయించిన గదికి రు.500, ఆ పైన ఛార్జి వసూలు చేస్తున్నట్టయితే దానిపై లగ్జరీ పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి […]

ఇక తెలంగాణలో రోగుల నుంచి లగ్జరీ టాక్స్‌!
X
తెలంగాణ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఏ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా రోగుల నుంచి లగ్జరీ పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవోకూడా జారీ చేసింది. ఇప్పటివరకు కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన లగ్జరీ ట్యాక్స్… ఇక నిమ్స్‌ వంటి ఆసుపత్రులకూ వర్తించనుంది. కొత్త జీవో ప్రకారం రాష్ట్రంలో ఏ ఆసుపత్రి అయినా రోగికి కేటాయించిన గదికి రు.500, ఆ పైన ఛార్జి వసూలు చేస్తున్నట్టయితే దానిపై లగ్జరీ పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. గదికి వేసే ఛార్జిపై దాదాపు పదిశాతం మేరకు ఈ పన్ను ఉంటుందని వాణిజ్యపన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జీలు లేనందున వాటిపై లగ్జరీ పన్ను పడదు. అయితే నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నందున ఈ ఆసుపత్రులలో చికిత్స తీసుకునే పేదలపై కూడా లగ్జరీ టాక్స్ భారం పడే అవకాశం ఉంది. అంటే జిల్లాస్థాయి మొదలుకొని హైదరాబాద్ వరకు అన్ని చిన్న, పెద్ద, ప్రైవేట్ ఆసుపత్రులన్నింటిలో లగ్జరీ టాక్స్‌ను ఇక నుంచి వసూలు చేయబోతున్నారన్నమాట.
First Published:  27 Aug 2015 5:36 AM GMT
Next Story