భారత సైన్యం అధీనంలో మరో ఉగ్రవాది!

జమ్ముకాశ్మీర్‌లో మరో పాక్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. లష్కర్ ఎ తొయిబాకు చెందిన ఈ టెర్రరిస్టు రాఫియాబాద్‌లో దొరికాడు. ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవలే ఉధంపూర్‌లో ఉస్మాన్ అలియాస్ నవేద్‌ను ఇద్దరు యువకుల ధైర్యసాహసాలతో పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. ఇపుడు మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మరో కీలక ఆధారం దొరికినట్లైంది. పట్టుబడిన ఉగ్రవాది పేరు సజ్జద్ అహ్మద్‌ అని తెలిసింది. లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదైన సజ్జద్ ముజఫర్‌గఢ్ ప్రాంతానికి చెందిన వాడు. ఇతన్ని పట్టుకోవడంతో వరుస బెట్టి ఉగ్రవాదులను భారత్‌ పైకి దండయాత్రకు పంపిస్తున్న పాకిస్థాన్‌ దుష్ట చర్యలను ప్రపంచం ముందుంచడానికి మరో సజీవ సాక్ష్యం లభించినట్లైంది. రాఫియాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా చనిపోయారు.