Telugu Global
Others

తెలంగాణ‌లో 86 కొత్త‌ బార్ల‌కు లైసెన్స్‌లు!

నూత‌న బార్ లైసెన్స్ విధానాన్ని టీ.స‌ర్కార్ బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ప‌ద‌మూడు వేల మంది జ‌నాభాకు ఒక బార్ అండ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలి. అందుకోసం 2011 జ‌నాభా లెక్క‌లను ప్రాతిప‌దిక‌గా తీసుకోవాలి. మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల ప‌రిధిలో 30 వేల జ‌నాభాకు బార్‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. త్రీస్టార్ హోట‌ల్స్‌, ఫైవ్‌స్టార్ హోట‌ల్స్‌లో కూడా బార్ల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు. ఈ పాల‌సీ ప్ర‌కారం రాష్ట్రంలో కొత్త‌గా 86 బార్లు ఏర్పాటుకానున్నాయి. అందులో జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 38 […]

తెలంగాణ‌లో 86 కొత్త‌ బార్ల‌కు లైసెన్స్‌లు!
X
నూత‌న బార్ లైసెన్స్ విధానాన్ని టీ.స‌ర్కార్ బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ప‌ద‌మూడు వేల మంది జ‌నాభాకు ఒక బార్ అండ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలి. అందుకోసం 2011 జ‌నాభా లెక్క‌లను ప్రాతిప‌దిక‌గా తీసుకోవాలి. మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల ప‌రిధిలో 30 వేల జ‌నాభాకు బార్‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. త్రీస్టార్ హోట‌ల్స్‌, ఫైవ్‌స్టార్ హోట‌ల్స్‌లో కూడా బార్ల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు. ఈ పాల‌సీ ప్ర‌కారం రాష్ట్రంలో కొత్త‌గా 86 బార్లు ఏర్పాటుకానున్నాయి. అందులో జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 38 బార్‌లు ప్రారంభం కానున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని బార్ల‌కు రూ. 35 ల‌క్ష‌లు మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల‌కు రూ.26 ల‌క్ష‌ల‌ను లైసెన్స్‌ఫీజుగా నిర్ణ‌యించింది. కొత్త బార్ల ఏర్పాటు ద్వారా ప్ర‌భుత్వానికి లైసెన్స్‌ఫీజు రూపంలో రూ.115 కోట్ల ఆదాయం ల‌భించ‌నుంది. బార్ల ఏర్పాటుకు ఒక‌టి కంటే ఎక్కువ ద‌ర‌ఖాస్తులు వ‌స్తే లాట‌రీ ద్వారా లైసెన్స్‌దారుడిని ఎంపిక‌ చేస్తారు.
First Published:  27 Aug 2015 2:51 AM GMT
Next Story