నాగార్జున బర్త్ డేకి 3 ఫస్ట్ లుక్కులు

కింగ్ నాగార్జున మరికొన్ని గంటల్లో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ పుట్టినరోజు నాగ్ కు వెరీవెరీ స్పెషల్. ఎందుకంటే.. తన రెండో కొడుకు అఖిల్ ఈ పుట్టినరోజుతోనే హీరోగా ఎదుగుతున్నాడు. మరో కొడుకు నాగచైతన్య ఇప్పటికే హీరోగా కొనసాగుతున్నాడు. ఇలా తన ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలో ఉండడం.. ఈ బర్త్ డే స్పెషల్. పైగా పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి వీళ్లందరి సినిమాల ఫస్ట్ లుక్కులు కూడా విడుదల చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి నాగార్జున పుట్టినరోజుపై అందరి దృష్టిపడింది. ఈ పుట్టినరోజు కానుకగా అక్కినేని అభిమానుల కోసం తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ రెడీ చేశాడు నాగ్. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయనా అనే సినిమా చేస్తున్నాడు నాగ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలకాబోతోంది. మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య చేస్తున్న సాహసం శ్వాసగా సాగిపో అనే యాక్షన్ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారు. వీటితో పాటు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అఖిల్ సినిమా టీజర్ ను కూడా నాగ్ పుట్టినరోజునాడే విడుదల చేస్తున్నారు. ఇలా అక్కినేని అభిమానులకు ఒకేరోజు ఎన్నో పండగలు తీసుకొస్తున్నాడు నాగ్.