అఖిల్ సినిమా పేరు కన్ ఫర్మ్ అయింది

మొత్తానికి సస్పెన్స్ కు తెరపడింది. ఎన్నో రోజుల ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పడింది. అఖిల్ కొత్త సినిమా టైటిల్ ఎట్టకేలకు విడుదలైంది. ఎన్నో పేర్లు పరిశీలించిన తర్వాత ఫైనల్ గా అఖిల్ అనే పేరునే ఫిక్స్ చేశారు మేకర్స్. గతంలో బాలరాజు, మిస్సైల్, ధమాకా పేర్లతో పాటు అఖిల్ పేరును కూడా పరిశీలించారు. చివరికి అఖిల్ సినిమాకు అతడి సొంత పేరునే ఖరారుచేశారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ను విడుదల చేస్తామని చెప్పినట్టుగానే.. బర్త్ డే కు ఒక రోజు ముందే అఖిల్ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇక నాగార్జున పుట్టినరోజు సందర్భంగా రేపు (ఆగస్ట్ 29) ఉదయం 10 గంటల 30 నిమిషాలకు అఖిల్ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్, తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, నితిన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.