భూ సేకరణపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం

భూసేకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నట్టు ఏపీ మంత్రి నారాయణ ప్రకటించారు. పవన్‌ కల్యాన్‌ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పవన్‌ విజ్ఞప్తి మేరకు రైతులను ఒప్పించి మాత్రమే ఇక భూమిని సమీకరిస్తామని తెలిపారు. భూసేకరణకు దిగితే తాను ధర్నాకు దిగుతానని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలిసింది. అసలు భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఇష్టం లేదని, సమీకరణ ద్వారానే భూములు తీసుకోవాలని ఆయన చెప్పారని, అయినా బలవంతంగా తానే నోటిఫికేషన్‌ ఇప్పించానని ఆయన చెప్పారు. భూ సమీకరణ ద్వారానే తాము రైతులను ఒప్పించి భూములను తీసుకుంటామని, గ్రామ కంఠాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నారాయణ తెలిపారు. సోమవారం లోగా సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.