క‌ల‌ర్స్ స్వాతి పెళ్లి కూతుర‌య్యింది..!

స్వామిరారా.  కార్తీకేయ చిత్రాల‌తో  అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైన   అష్టాచెమ్మ ఫేమ్ క‌ల‌ర్స్ స్వాతి..   తాజాగా     త్రిపుర పేరు తో ఒక చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌య్యింది.  ఈ టీజ‌ర్ లో  స్వాతి  పెళ్లి డ్రెస్ లో  కళ క‌ళాడుతుంది. . క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గీతాంజలి’ ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి స్టేజికి చేరుకుంది. ఈ సందర్బంగా టీజర్ ని విడుదల చేసారు. తమిళ వెర్ష‌న్ కు  ‘తిరుపుర సుందరి’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.

 ఇప్ప‌టి వ‌రకు స్వాతి చేసిన రోల్స్ కంటే.. చాల భిన్న‌మైన రోల్ ఈ చిత్రం చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.  దర్శకుడు మాట్లాడుతూ ‘ ఓ శక్తిమంతమైన కథాంశంతో రూపుదిద్దుకొనే ఈ సినిమాలో స్వాతి ఇంతవరకూ చేయని ఓ విభిన్న పాత్ర పోషిస్తోంది. నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే సినిమా అవుతుంది’ అని తెలిపారు. బిహైండ్ ది స్క్రీన్ కోన వెంక‌ట్,  వెలిగొండ శ్రీ‌నివాస్ ఈ సినిమాకు  వున్న‌ట్లు తెలుస్తుంది.  గీతాంజలి త‌ర‌హాలో వ‌స్తున్న  త్రిపుర ..  క‌ల‌ర్స్ స్వాతికి   కెరీర్ ప‌రంగా మంచి బ్రేక్  ఇస్తుందంటున్నారు చి్త్ర యూనిట్.