Telugu Global
NEWS

మంచు విష్ణు 10 గ్రామాల దత్తత

మంచు విష్ణువర్థన్‌ చిత్తూరు జిల్లాలో పది గ్రామాలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. తమ సొంత జిల్లాలోని చంద్రగిరి మండలంలో దత్తత తీసుకుంటున్న ఈ పది గ్రామాల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పనకు నడుం బిగిస్తున్నట్టు తెలిపారు. ఆయా గ్రామాల్లో మంచినీరు, మరుగుదొడ్లు, కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. గ్రామాల దత్తతకు ముందు మహారాష్ట్రలోని బాగా వెనుకబడి ఆ తర్వాత అభివృద్ధి చెందిన షిర్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిన […]

మంచు విష్ణు 10 గ్రామాల దత్తత
X
మంచు విష్ణువర్థన్‌ చిత్తూరు జిల్లాలో పది గ్రామాలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. తమ సొంత జిల్లాలోని చంద్రగిరి మండలంలో దత్తత తీసుకుంటున్న ఈ పది గ్రామాల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పనకు నడుం బిగిస్తున్నట్టు తెలిపారు. ఆయా గ్రామాల్లో మంచినీరు, మరుగుదొడ్లు, కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. గ్రామాల దత్తతకు ముందు మహారాష్ట్రలోని బాగా వెనుకబడి ఆ తర్వాత అభివృద్ధి చెందిన షిర్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిన ఈ ప్రాంతంలో ఆ గ్రామ దత్తతకు ముందు ఆ తర్వాత ఉన్న జన జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని భావించిన విష్ణు పది గ్రామాలను దత్తతకు తీసుకుని అభివృద్ధికి నడుం బిగించారు.
First Published:  28 Aug 2015 3:45 AM GMT
Next Story