Telugu Global
Cinema & Entertainment

కోమలి కథ బయటకొచ్చింది

ఓకే బంగారం సినిమాతో హిట్ కొట్టిన మణిరత్నం వెంటనే కోమలి అనే ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు. ఓకే బంగారం హిట్టవ్వడం.. కోమలి అనే టైటిల్ చాలా సుకుమారంగా ఉండడంతో అంతా ఇదొక రొమాంటిక్ సినిమా అనుకున్నారు.  ఓకే బంగారం, సఖి లాంటి సినిమాల తరహాలోనే సాగుతుందని భావించారు. కానీ మణిరత్నం అందరికీ షాకిచ్చాడు. కోమలి స్టోరీలైన్ ను సూత్రప్రాయంగా బయటపెట్టాడు. సమాజానికి బలమైన సందేశాన్నిచ్చేలా ఈ సినిమా ఉంటుందంటున్నాడు మణిరత్నం. కక్షలు-ప్రతీకారాలు సమస్యకు పరిష్కారం కావంటూ చెప్పే […]

కోమలి కథ బయటకొచ్చింది
X
ఓకే బంగారం సినిమాతో హిట్ కొట్టిన మణిరత్నం వెంటనే కోమలి అనే ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు. ఓకే బంగారం హిట్టవ్వడం.. కోమలి అనే టైటిల్ చాలా సుకుమారంగా ఉండడంతో అంతా ఇదొక రొమాంటిక్ సినిమా అనుకున్నారు. ఓకే బంగారం, సఖి లాంటి సినిమాల తరహాలోనే సాగుతుందని భావించారు. కానీ మణిరత్నం అందరికీ షాకిచ్చాడు. కోమలి స్టోరీలైన్ ను సూత్రప్రాయంగా బయటపెట్టాడు. సమాజానికి బలమైన సందేశాన్నిచ్చేలా ఈ సినిమా ఉంటుందంటున్నాడు మణిరత్నం. కక్షలు-ప్రతీకారాలు సమస్యకు పరిష్కారం కావంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేశాడు మణిరత్నం. వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమౌతున్నాడు. సినిమాలో కార్తి, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తారు. ఓ హీరోయిన్ గా కీర్తి సురేష్ కన్ ఫర్మ్ అయింది. మరో హీరోయిన్ కోసం వెదుకుతున్నారు. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. యువ సినిమా తరహాలో సాగుతుందని సమాచారం.
First Published:  27 Aug 2015 7:00 PM GMT
Next Story