Telugu Global
Others

భార‌త్‌పై ఐరాస‌కు ఫిర్యాదు చేసిన పాక్

పాకిస్థాన్ ప్ర‌వ‌ర్త‌న చూసిన వారికి మొగుడిని కొట్టి … అన్న సామెత‌ను గుర్తు వస్తోంది. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మ‌న‌దేశంలో ప‌లుమార్లు కాల్పులు జ‌ర‌పడంతోపాటు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో వేర్పాటువాద హురియ‌త్ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని ప్ర‌క‌టించింది. పాక్ వైఖ‌రిని గ‌ర్హిస్తూ భార‌త్ ఢిల్లీలో జ‌ర‌గాల్సిన జాతీయ‌భ‌ద్ర‌తా అధికారుల స్థాయి స‌మావేశాన్ని ర‌ద్దు చేసింది. దీనిపై పాక్ ఐక్య‌రాజ్య‌స‌మితికి ఫిర్యాదు చేసింది. రెండు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగేందుకు భార‌త్ ముంద‌స్తు ఆంక్ష‌లు […]

పాకిస్థాన్ ప్ర‌వ‌ర్త‌న చూసిన వారికి మొగుడిని కొట్టి … అన్న సామెత‌ను గుర్తు వస్తోంది. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మ‌న‌దేశంలో ప‌లుమార్లు కాల్పులు జ‌ర‌పడంతోపాటు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో వేర్పాటువాద హురియ‌త్ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని ప్ర‌క‌టించింది. పాక్ వైఖ‌రిని గ‌ర్హిస్తూ భార‌త్ ఢిల్లీలో జ‌ర‌గాల్సిన జాతీయ‌భ‌ద్ర‌తా అధికారుల స్థాయి స‌మావేశాన్ని ర‌ద్దు చేసింది. దీనిపై పాక్ ఐక్య‌రాజ్య‌స‌మితికి ఫిర్యాదు చేసింది. రెండు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగేందుకు భార‌త్ ముంద‌స్తు ఆంక్ష‌లు విధిస్తోంద‌ని, శాంతి చ‌ర్చ‌ల‌కు భార‌త్ సిద్ధంగా లేద‌ని ఆరోపిస్తూ ఐరాస డిప్యూటీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు పాక్ ప్ర‌భుత్వం ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన ఐరాస రెండు దేశాలూ చ‌ర్చ‌ల ద్వారా కాశ్మీర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచిస్తూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

First Published:  27 Aug 2015 1:03 PM GMT
Next Story