​షీనా బోరా అస్థికలు వెలికితీత

షీనా బోరా హత్య కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. హత్యానంతరం మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆమె శవాన్ని సమాధి చేసిన స్థలం నుంచి ఇవాళ పోలీసులు అస్థికలను సేకరించారు. షీనా బోరా కపాలం, మరికొన్ని ఆస్థికలు లభించాయి. మరిన్ని ఆనవాళ్ల కోసం గాలిస్తున్నారు. షీనా తల్లి ఇంధ్రాణి ముఖర్జీ తన భర్తతో కలిసి షీనాను హత్య చేశారు. అనంతరం షీనా ముఖాన్ని చెరిపివేసి మృతదేహాన్ని సూట్ కేసులో ఉంచి కాల్చివేసి నిర్జన ప్రదేశంలో పడేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పూడ్చి వేయించారు. కాగా, షీనా హత్యకు గురైన ఉదంతం వెలుగులోకి రావడంతో పోలీసులు షీనా ఆస్థికలను వెలికి తీశారు.