Telugu Global
Others

తిరుమల కొండపై నీటి సమస్య తీవ్రం!

తిరుమల శ్రీవారి కొండపై నీటి సమస్య తీవ్ర మవుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేకపోవడంతో టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిత్యం లక్షల మంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. వీరికి తోడు 20 వేల మంది టీటీడీ సిబ్బంది కొండపైనే నివాసం ఉంటారు. ఉన్న కొద్దిపాటి నీటిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే తిరుమల కొండపై నీటి కోసం ఐదు జలాశయాలు ఉన్నాయి. ఇవికాక తిరుపతి కళ్యాణి డాం నుంచి బోర్ల […]

తిరుమల కొండపై నీటి సమస్య తీవ్రం!
X

తిరుమల శ్రీవారి కొండపై నీటి సమస్య తీవ్ర మవుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేకపోవడంతో టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిత్యం లక్షల మంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. వీరికి తోడు 20 వేల మంది టీటీడీ సిబ్బంది కొండపైనే నివాసం ఉంటారు. ఉన్న కొద్దిపాటి నీటిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే తిరుమల కొండపై నీటి కోసం ఐదు జలాశయాలు ఉన్నాయి. ఇవికాక తిరుపతి కళ్యాణి డాం నుంచి బోర్ల ద్వారా నీటిని తిరుమలకు తరలిస్తున్నారు. తిరుమల కొండపై నిత్యం 25 నుంచి 30 గ్యాలెన్ల నీటి వాడకం జరుగుతుంది. అయితే వానలు కురవకపోవడంతో జలాశయాలు ఎండిపోయాయి. ఆకాశగంగ భూగర్భంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. కుమారధార, పసుపుధార జలాశయాలు డెడ్‌ స్టోరేజ్‌కు చేరాయి. పాపవినాశనంలో 500 గ్యాలెన్ల నీరు మాత్రమే ఉంది. రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితి ఎదురు కాకుండా ఉండేందుకు ఏం చేయాలోనని టీటీడీ అధికారులు సతమతమవుతున్నారు.

First Published:  28 Aug 2015 12:02 AM GMT
Next Story