Telugu Global
Others

వైద్య‌ప‌రికరాల త‌యారీ కేంద్రంగా హైద‌రాబాద్ 

హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ డ్ర‌గ్స్ ఫార్మాస్యూటిక‌ల్స్‌కు చెందిన 500 ఎక‌రాల్లో వైద్య ప‌రిక‌రాల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఉన్న‌తాధికారి ఒకరు ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ రంగ ఔషధ సంస్థకు  హైద‌రాబాద్‌, గుర‌గావ్‌, చెన్నై, రిషికేవ్‌ల‌లో  సుమారు 2వేల ఎక‌రాల భూములున్నాయి. వీటిలో హైద‌రాబాద్‌లోని భూమిని వైద్య ప‌రిక‌రాల త‌యారీ కేంద్రానికి లీజుకివ్వ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. హ‌బ్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్తు, నీరు, డ్రైనేజీ, ప‌రిశోధ‌న కేంద్రాల వంటి సౌక‌ర్యాల‌ను కేంద్రం […]

హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ డ్ర‌గ్స్ ఫార్మాస్యూటిక‌ల్స్‌కు చెందిన 500 ఎక‌రాల్లో వైద్య ప‌రిక‌రాల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఉన్న‌తాధికారి ఒకరు ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ రంగ ఔషధ సంస్థకు హైద‌రాబాద్‌, గుర‌గావ్‌, చెన్నై, రిషికేవ్‌ల‌లో సుమారు 2వేల ఎక‌రాల భూములున్నాయి. వీటిలో హైద‌రాబాద్‌లోని భూమిని వైద్య ప‌రిక‌రాల త‌యారీ కేంద్రానికి లీజుకివ్వ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. హ‌బ్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్తు, నీరు, డ్రైనేజీ, ప‌రిశోధ‌న కేంద్రాల వంటి సౌక‌ర్యాల‌ను కేంద్రం క‌ల్పించ‌నుంది.ఆ త‌ర్వాత ప్రైవేట్ సంస్థ‌లు ప్లాంటుల‌ను ఏర్పాటు చేస్తాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. వీటితో పాటు జాతీయ వైద్య ప‌రిక‌రాల ప్రాధికారిక‌ సంస్థ‌ను కూడా ఏర్పాటు చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. రూ. 500 కోట్ల డాల‌ర్ల విలువైన దేశీయ‌ డ్ర‌గ్స్ ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర ఈ చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని ఆయ‌న అన్నారు.​
First Published:  28 Aug 2015 1:58 PM GMT
Next Story