Telugu Global
Others

ఆరోగ్య రక్షణకే చౌక మద్యం: తుమ్మల

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే… తమ ప్రభుత్వం చౌక మద్యాన్ని ప్రవేశపెడుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మెదక్ జిల్లాకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ ప్రతిపక్షాలు నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ప్రభుత్వానికి నష్టం జరిగినా చీప్‌ లిక్కర్‌ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అలాగే ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ప్రతి ఎకరాకు నీరిందించడమే ప్రభుత్వ లక్ష్యమని, గతంలో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని, […]

ఆరోగ్య రక్షణకే చౌక మద్యం: తుమ్మల
X
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే… తమ ప్రభుత్వం చౌక మద్యాన్ని ప్రవేశపెడుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మెదక్ జిల్లాకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ ప్రతిపక్షాలు నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ప్రభుత్వానికి నష్టం జరిగినా చీప్‌ లిక్కర్‌ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అలాగే ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ప్రతి ఎకరాకు నీరిందించడమే ప్రభుత్వ లక్ష్యమని, గతంలో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని, అయినా మళ్లీ ఇప్పుడు వాళ్లే ప్రాజెక్టుల బాట పట్టడం విడ్డూరంగా ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆశాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. ప్రస్తుతం ఆయన కూడా నీతులు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఆయన విమర్శించారు.

First Published:  29 Aug 2015 10:30 AM GMT
Next Story