టీడీపీలోకి మాజీ మంత్రి డొక్కా!

కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ టీడీపీలో చేరారు. డొక్కా చేరికపై ఆయన రాజకీయ గురువు, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు శనివారమే ఒక ప్రకటన చేశారు. డొక్కా గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరిగింది. నిజానికి ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరాల్సి ఉన్న సమయంలో రాయపాటి జోక్యంతో వెనక్కు తగ్గారు. తాజాగా చంద్రబాబుతో మాట్లాడి డొక్కా చేరికకు రాయపాటి గ్రీన్‌సిగ్నల్‌ ఇప్పించారు. దీంతో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారని తెలిసింది.