శ్రీ‌మంతుడు క‌లెక్ష‌న్ల గ‌జిబిజి…! 

శ్రీ‌మంతుడు  చిత్రం  క‌లెక్ష‌న్ల విష‌యంలో  గజిబిజి  గంద‌ర గోళం  క‌నిపిస్తుంది. ఈ చిత్రం విడుద‌లైన నాలుగు రోజుల్లోనే   విడుద‌లైన అన్ని చోట్ల క‌లిపి 70   కోట్ల షేర్  క‌లెక్ట్ చేసిందంటూ    సోష‌ల్ మీడియాలో వార్త‌లు రాసేశారు. క‌ట్ చేస్తే  ప్ర‌స్తుతం   ఈచిత్రం  18 రోజుల  క‌లెక్ష‌న్స్ 75 కోట్లే అంటూ రాస్తున్నారు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్  అత్తారింటికి దారేది సినిమా క‌లెక్ష‌న్స్ ను బ్రేక్ చేసిందంటూ   మొద‌టి వారంలోనే రాశారు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్  చిత్రం ఫుల్ లెంగ్త్ లో  దాదాపు 90 కోట్లు వ‌సూలు చేసింది.  అలా చూస్తే… మ‌హేష్ బాబు శ్రీ‌మంతుడు చిత్రం ఇప్ప‌టికి  అత్తారింటికి దారేది  బాక్సాపీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేయ‌నట్లే క‌దా.!    ఏంటో ఈ గ‌జిబిజి గంద‌ర గోళం పోవాలంటే.. శ్రీ‌మంతుడు ప్రొ్డ్యూస‌ర్సే అధికారికంగా  క‌లెక్ష‌న్స్ డేటా ఎనౌన్స్ చేయాలి మ‌రి.
Shruti Hassan Stills [gmedia id=982]