Telugu Global
Others

కోటీశ్వ‌రుల‌కే మద్యం 'మండల దుకాణం'

తెలంగాణ ప్ర‌భుత్వం అక్టోబ‌రు నుంచి అమల్లోకి తీసుకు రానున్న నూత‌న‌ ఎక్సైజ్ విధానంతో మండ‌లానికి చెందిన మ‌ద్యం విక్ర‌యాల‌న్నీ ఒక్క‌రి చేతిలోకే వెళ్ల‌నున్నాయి. అందుకోసం లైసెన్స్‌దారుల వ‌ద్ద నుంచి రూ.1.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వ‌ర‌కు ఫీజు వ‌సూలు చేయ‌నుంది. అవినీతికి ఇది అదనం. మ‌ద్యం లైసెన్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసే అప్లికేష‌న్ ఫారం ధ‌ర‌ను రెండు ల‌క్ష‌లు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీంతో మండ‌ల‌ మ‌ద్యం వ్యాపారం మొత్తం కోటీశ్వ‌రుల చేతిలోకి వెళుతుందని అర్ధమవుతుంది. […]

కోటీశ్వ‌రుల‌కే మద్యం మండల దుకాణం
X

తెలంగాణ ప్ర‌భుత్వం అక్టోబ‌రు నుంచి అమల్లోకి తీసుకు రానున్న నూత‌న‌ ఎక్సైజ్ విధానంతో మండ‌లానికి చెందిన మ‌ద్యం విక్ర‌యాల‌న్నీ ఒక్క‌రి చేతిలోకే వెళ్ల‌నున్నాయి. అందుకోసం లైసెన్స్‌దారుల వ‌ద్ద నుంచి రూ.1.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వ‌ర‌కు ఫీజు వ‌సూలు చేయ‌నుంది. అవినీతికి ఇది అదనం. మ‌ద్యం లైసెన్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసే అప్లికేష‌న్ ఫారం ధ‌ర‌ను రెండు ల‌క్ష‌లు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీంతో మండ‌ల‌ మ‌ద్యం వ్యాపారం మొత్తం కోటీశ్వ‌రుల చేతిలోకి వెళుతుందని అర్ధమవుతుంది. లైసెన్స్‌దారుల‌కు మండ‌లంలోని ప్ర‌ధాన దుకాణంతో పాటు గ్రామాల్లోని బీ-షాపులు కూడా వారికే చెంద‌నున్నాయి. నూత‌న మ‌ద్యం విధానం ద్వారా ప్ర‌భుత్వం అప్లికేష‌న్ ధ‌ర‌తోపాటు ఫీజును కూడా భారీగా పెంచింది. గ‌తంలో పాతిక‌వేల రూపాయ‌లున్న అప్లికేష‌న్ ధ‌ర ఇప్పుడు రెండు ల‌క్ష‌ల‌కు పెంచారు. గ‌తంలో ప‌దివేల జ‌నాభా ఉన్న గ్రామీణ ప్రాంతంలో మ‌ద్యం దుకాణానికి రూ. 32.5 ల‌క్ష‌లు వ‌సూలు చేయ‌గా, ప‌ది వేల నుంచి 50 వేల లోపు జ‌నాభాకు రూ.34 ల‌క్ష‌లు వ‌సూలు చేసేది. అయితే, ఇప్పుడు ఆ ఫీజును రూ. 1.5 కోట్ల నుంచి రూ. 5 కోట్ల‌కు పెంచింది. దీంతో ప‌ది కోట్ల రూపాయ‌లున్న వారే మ‌ద్యం దుకాణం లైసెన్స్‌ల కోసం పోటీ ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌భుత్వ విధానంతో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు చెందిన మ‌ద్యం డ్ర‌గ్ మాఫియా మండ‌లాల్లోకి కూడా ప్ర‌వేశించ‌నుంద‌ని ప‌ట్ట‌ణాల్లోని మ‌ద్యం వ్యాపారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

First Published:  30 Aug 2015 1:29 AM GMT
Next Story