Telugu Global
NEWS

అనంత‌పురంలో ఓల్వో బ‌స్సు ద‌గ్ధం!

హైద‌రాబాద్ నుంచి కేర‌ళ‌లోని కాలిక‌ట్‌కు వెళ‌తున్న వోల్వో బ‌స్సు అగ్నికి ఆహుతైంది. అనంత‌పురం జిల్లా గార్లెదిన్నె మండ‌లం తిమ్మంపేట వ‌ద్ద ఆదివారం తెల్ల‌వారుజామున ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ బ‌స్సు కేర‌ళ‌లోని క‌ల్లాడ ట్రావెల్స్‌కు చెందినది. ఓ ప్ర‌యాణికుడి మూత్ర విస‌ర్జ‌న కోసం తిమ్మంపేట వ‌ద్ద బ‌స్సు ఆగింది. అదేస‌మ‌యంలో బ‌స్సులో నుంచి పొగ‌లు రావ‌డంతో డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. నిద్ర‌లో ఉన్న‌35 మంది ప్ర‌యాణికుల‌ను హుటాహుటిన త‌ట్టిలేపాడు. అంద‌రినీ కిందికి దించాడు. అప్ప‌టికే బ‌స్సులో షార్ట్ స‌ర్క్యూట్ […]

అనంత‌పురంలో ఓల్వో బ‌స్సు ద‌గ్ధం!
X
హైద‌రాబాద్ నుంచి కేర‌ళ‌లోని కాలిక‌ట్‌కు వెళ‌తున్న వోల్వో బ‌స్సు అగ్నికి ఆహుతైంది. అనంత‌పురం జిల్లా గార్లెదిన్నె మండ‌లం తిమ్మంపేట వ‌ద్ద ఆదివారం తెల్ల‌వారుజామున ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ బ‌స్సు కేర‌ళ‌లోని క‌ల్లాడ ట్రావెల్స్‌కు చెందినది. ఓ ప్ర‌యాణికుడి మూత్ర విస‌ర్జ‌న కోసం తిమ్మంపేట వ‌ద్ద బ‌స్సు ఆగింది. అదేస‌మ‌యంలో బ‌స్సులో నుంచి పొగ‌లు రావ‌డంతో డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. నిద్ర‌లో ఉన్న‌35 మంది ప్ర‌యాణికుల‌ను హుటాహుటిన త‌ట్టిలేపాడు. అంద‌రినీ కిందికి దించాడు. అప్ప‌టికే బ‌స్సులో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు మొద‌ల‌య్యాయి. క్ష‌ణాల్లోనే బ‌స్సు మొత్తం వ్యాపించాయి. నిమిషాల్లో బ‌స్సు కాలి బూడిదైంది. ప్ర‌యాణికులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌టంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో భారీ ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. ఈ ప్ర‌మాదం కార‌ణంగా జాతీయ ర‌హ‌దారిపై అరగంట‌పాటు ట్రాఫిక్‌జామ్ అయింది. సంఘ‌ట‌న‌స్థ‌లానికి స్థానిక పోలీసులు చేరుకున్నారు. మంత్రి ప‌రిటాల సునీత ఘ‌ట‌న‌పై స్పందించారు. ప్ర‌యాణికుల‌కు ప్ర‌త్య‌మ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.
First Published:  30 Aug 2015 3:39 AM GMT
Next Story