Telugu Global
Family

సేవ (Devotional)

అది సిక్కుల గురువు అర్జునదేవ్‌ కాలం. ఆఫ్‌ఘనిస్థాన్‌లోని కాబూల్‌నించీ అమృతసర్‌లోని స్వర్ణమందిర దర్శనానికి భక్తులు బయల్దేరారు. వాళ్ళు దారిలో ఒక సిక్కును, అతని భార్యను కలిశారు. ఆ దంపతులు ఆ సమూహానికి (సిక్కు పరిభాషలో “సంగత్‌”కు) సేవ చేశారు. ఆ సిక్కు భక్తుల పాదాలు ఒత్తాడు. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే విసనకర్రతో విసిరాడు. వాళ్ళకోసం నీళ్ళు తెచ్చాడు. ఇంకా ఎన్నో అనుకూలాలు కల్పించాడు. మరుసటిరోజు భక్తులతో కలిసి ఆ సిక్కు అమృతసర్‌కు బయల్దేరాడు. వాళ్ళందరూ దర్బార్‌సాహెబ్‌ను […]

అది సిక్కుల గురువు అర్జునదేవ్‌ కాలం. ఆఫ్‌ఘనిస్థాన్‌లోని కాబూల్‌నించీ అమృతసర్‌లోని స్వర్ణమందిర దర్శనానికి భక్తులు బయల్దేరారు. వాళ్ళు దారిలో ఒక సిక్కును, అతని భార్యను కలిశారు. ఆ దంపతులు ఆ సమూహానికి (సిక్కు పరిభాషలో “సంగత్‌”కు) సేవ చేశారు. ఆ సిక్కు భక్తుల పాదాలు ఒత్తాడు. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే విసనకర్రతో విసిరాడు. వాళ్ళకోసం నీళ్ళు తెచ్చాడు. ఇంకా ఎన్నో అనుకూలాలు కల్పించాడు.

మరుసటిరోజు భక్తులతో కలిసి ఆ సిక్కు అమృతసర్‌కు బయల్దేరాడు. వాళ్ళందరూ దర్బార్‌సాహెబ్‌ను చేరారు. ఆ భక్తుల బృందానికి నాయకుడయిన జతేదార్‌ కొంతమంది కుర్రాళ్ళని చూసి అందరికి చెప్పుల్ని జాగ్రత్తగా చూడమని చెప్పాడు. కానీ ఆ కుర్రాళ్ళలో ఎవరూ ఆ పని చేయడానికి సిద్ధంగా లేరు. ఎవరికి వాళ్ళు మొదటగా గురూజీ దర్శనం చెయ్యాలని ఉత్సాహంగా ఉన్నారు. అప్పుడు భక్తుల బృందంతో బాటు వచ్చిన సిక్కు నేను చెప్పుల బాధ్యత తీసుకుంటానన్నాడు.

తక్కిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళి నలభయి నిముషాలపాటు ఉన్నారు. కానీ గురూజీ కనిపించలేదు. అప్పుడు జితేదార్‌ ముందుకు వచ్చి బాబా బుద్ధాజీని గురూజీ ఎక్కడ? అని అడిగాడు.

బాబాజీ:– “గురూజీ కాబుల్‌నించీ వస్తున్న సంగత్‌”ని కలవడానికి వెళ్ళారు.

జితేదార్‌:- కానీ కాబూల్‌ నించీ వచ్చిన “సంగత్‌” మేమే

బాబాజీ:– అయితే మీరు గురువు గారిని కలవలేదా?

జితేదార్‌:- లేదు బాబాజీ! కానీ ఒక సిక్కు దంపతుల్ని కలిశాం

బాబాజీ:- ఆ సిక్కు ఇప్పుడెక్కడున్నాడు?

జితేదార్‌:- మేము వదిలిన చెప్పులకు కావలికాస్తున్నాడు.

బాబాజీ బితేదార్‌ వెంటనడిచారు. తక్కిన అందరూ వాళ్ళిని అనుసరించారు. బయటకివచ్చి చూశారు. అక్కడ అందరి చెప్పుల్ని శుభ్రపరుస్తూ ఒక సిక్కు కనిపించాడు. అతనే గురూజీ!

– సౌభాగ్య

First Published:  31 Aug 2015 5:01 AM GMT
Next Story