Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 192

1+1 “ఈ పుస్తకం చదివితే నువ్వనుకున్నది సగం సాధించినట్లు”. “ఐతే రెండు పుస్తకాలివ్వండి”. —————————————————————— బిజినెస్‌ ట్రిక్‌ కొత్తగా పెట్టిన చేపల అంగడి అభివృద్ధి చెందడం చూసిన కస్టమర్‌ చేపల షాపతన్ని “మీ వ్యాపారం అభివృద్ధి చెందడంలోని రహస్యం ఏమిటి?” అని అడిగాడు. చేపల వ్యాపారి “అదో సీక్రెట్‌. మీరు మా రెగ్యులర్‌ కస్టమర్‌ కాబట్టి చెబుతున్నా. చేపల తలలు వారం తింటే తెలివి పెరుగుతుంది” అన్నాడు. ఖరీదడిగాడు కస్టమర్‌. “ఒక్కో తల పన్నెండు రూపాయలు” అన్నాడు […]

1+1
“ఈ పుస్తకం చదివితే నువ్వనుకున్నది సగం సాధించినట్లు”.
“ఐతే రెండు పుస్తకాలివ్వండి”.
——————————————————————
బిజినెస్‌ ట్రిక్‌
కొత్తగా పెట్టిన చేపల అంగడి అభివృద్ధి చెందడం చూసిన కస్టమర్‌ చేపల షాపతన్ని “మీ వ్యాపారం అభివృద్ధి చెందడంలోని రహస్యం ఏమిటి?” అని అడిగాడు.
చేపల వ్యాపారి “అదో సీక్రెట్‌. మీరు మా రెగ్యులర్‌ కస్టమర్‌ కాబట్టి చెబుతున్నా. చేపల తలలు వారం తింటే తెలివి పెరుగుతుంది” అన్నాడు. ఖరీదడిగాడు కస్టమర్‌. “ఒక్కో తల పన్నెండు రూపాయలు” అన్నాడు వ్యాపారస్థుడు.
కస్టమర్‌ వారం తర్వాత వచ్చి “నా తెలివేమీ పెరగలేదే” అన్నాడు.”మీరు ఎక్కువ తినాలి” అన్నాడు వ్యాపారి. కస్టమర్‌ మరో వారం తర్వాత వచ్చి “మోసం, దగా! బయట డజను పన్నెండ్రూపాయలకు అమ్ముతూ ఉంటే మీరేమో ఒక్కోటి పన్నెండు రూపాయలకమ్ముతున్నారు” అన్నాడు కోపంగా. “చూడండి! వాటిని బాగా తినడం వల్ల అప్పుడే మీ తెలివితేటలు పెరిగాయి” వ్యాపారస్థుడు అన్నాడు.
——————————————————————
నిజాయితీ
కొత్తగా ఆ ఊరికి వచ్చిన ఆ వ్యక్తి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళతో “ఇక్కడే స్థిరపడి నిజాయితీగా బతుకు దామనుకుంటున్నాను” అన్నాడు.
దానికి ఒకతను “తప్పకుండా. ఆ విషయంలో మీకెవరూ పోటీరారులెండి” అన్నాడు.

First Published:  31 Aug 2015 5:03 AM GMT
Next Story