Telugu Global
Cinema & Entertainment

సినిమా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ మెంట్

సినీతారలంటే ఎప్పుడూ షూటింగులు, ప్రారంభోత్సవాలు మాత్రమే కాదు.. వాళ్లకు కూడా ఓ లైఫ్ ఉంటుంది. వాళ్లకు కూడా ఓ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. అలనాటి హీరోయిన్ ఖుష్బూకైతే ఈ సర్కిల్ ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. టైం దొరికినప్పుడల్లా తన సినిమా ఫ్రెండ్స్ అందర్నీ కలవడానికి ప్రాధాన్యం ఇస్తుంది ఖుష్బూ. ఇప్పటికే ఓసారి అలాంటి గెట్‌టుగెదర్‌లో పాల్గొంది. తాజాగా తనే స్వయంగా మరో గెట్ టుగెదర్ ఎరేంజ్ చేసింది. 19వ దశకంలో తను కలిసి నటించిన హీరోలు, హీరోయిన్లు […]

సినిమా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ మెంట్
X
సినీతారలంటే ఎప్పుడూ షూటింగులు, ప్రారంభోత్సవాలు మాత్రమే కాదు.. వాళ్లకు కూడా ఓ లైఫ్ ఉంటుంది. వాళ్లకు కూడా ఓ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. అలనాటి హీరోయిన్ ఖుష్బూకైతే ఈ సర్కిల్ ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. టైం దొరికినప్పుడల్లా తన సినిమా ఫ్రెండ్స్ అందర్నీ కలవడానికి ప్రాధాన్యం ఇస్తుంది ఖుష్బూ. ఇప్పటికే ఓసారి అలాంటి గెట్‌టుగెదర్‌లో పాల్గొంది. తాజాగా తనే స్వయంగా మరో గెట్ టుగెదర్ ఎరేంజ్ చేసింది. 19వ దశకంలో తను కలిసి నటించిన హీరోలు, హీరోయిన్లు అందర్నీ ఈ గెట్ టుగెదర్ కు ఆహ్వానించింది. తెలుగు-తమిళ చిత్రపరిశ్రమలకు చెందిన అలనాటి స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ గెట్ టుగెదర్ కు హాజరయ్యారు. అంతా డ్రెస్ కోడ్ కూడా పాటించడం విశేషం. తెలుగు చిత్రసీమ నుంచి ఈ పార్టీకి చిరంజీవి, వెంకటేశ్, నరేష్, సుమన్ లాంటి తారలు హాజరైతే.. తమిళ పరిశ్రమ నుంచి ప్రభు, సత్యరాజ్ లాంటి సీనియర్లు హాజరయ్యారు. అంతా కలిసి దిగిన ఫొటోను ఖుష్బూ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెట్టింది.
First Published:  30 Aug 2015 7:02 PM GMT
Next Story