Telugu Global
Others

భూ బిల్లుపై మోదీ స‌ర్కారు వెన‌క‌డుగు!

ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌లు, మేధావుల నిర‌స‌న‌లు, రైతుల్లో భ‌యాందోళ‌న‌లు వెర‌సి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగ‌లిగాయి. సెప్టెంబ‌రులో మ‌రోసారి పార్ల‌మెంటు స‌మావేశాలు ఉంటాయ‌నుకుంటున్న వేళ మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. మ‌రోసారి వివాదాస్ప‌ద భూసేక‌ర‌ణ బిల్లుపై ఎలాంటి ఆర్డినెన్సు జారీ చేయ‌బోమ‌ని వెల్ల‌డించారు. ఆదివారం జ‌రిగిన మ‌న్‌కీబాత్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. అయితే, దీనిపై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. రైతుల సంక్షేమం కోసమే తామీ బిల్లు రూపొందించాల‌నుకున్నామ‌ని, త‌మ ప్ర‌భుత్వం రైతుల‌కు వ్య‌తిరేకం కాద‌ని పున‌రుద్ఘాటించారు. […]

భూ బిల్లుపై మోదీ స‌ర్కారు వెన‌క‌డుగు!
X
ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌లు, మేధావుల నిర‌స‌న‌లు, రైతుల్లో భ‌యాందోళ‌న‌లు వెర‌సి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగ‌లిగాయి. సెప్టెంబ‌రులో మ‌రోసారి పార్ల‌మెంటు స‌మావేశాలు ఉంటాయ‌నుకుంటున్న వేళ మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. మ‌రోసారి వివాదాస్ప‌ద భూసేక‌ర‌ణ బిల్లుపై ఎలాంటి ఆర్డినెన్సు జారీ చేయ‌బోమ‌ని వెల్ల‌డించారు. ఆదివారం జ‌రిగిన మ‌న్‌కీబాత్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. అయితే, దీనిపై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. రైతుల సంక్షేమం కోసమే తామీ బిల్లు రూపొందించాల‌నుకున్నామ‌ని, త‌మ ప్ర‌భుత్వం రైతుల‌కు వ్య‌తిరేకం కాద‌ని పున‌రుద్ఘాటించారు.
ప్ర‌తిప‌క్షాల విజ‌యం..!
మొద‌టి నుంచి భూసేక‌ర‌ణ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. దీనిపై ప‌లుమార్లు నిర‌స‌న‌లు కూడా చేప‌ట్టింది. ఒక సంద‌ర్భంలో యూపీఏ ఆధ్వ‌ర్యంలో అధినేత్రి సోనియాగాంధీ స్వ‌యంగా నిర‌స‌న‌కు నేతృత్వం వ‌హించిన రాష్ట్ర‌ప‌తికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. వివిధ పార్టీల‌కు చెందిన దాదాపు 100 మంది ఎంపీలు పాల్గొన‌డం విశేషం. తాజాగా భూ ఆర్డినెన్స ఉండ‌బోద‌న్న ప్ర‌ధాని ప్ర‌కట‌న ప్ర‌తిప‌క్షాలు త‌మ విజ‌యంగా అభివ‌ర్ణించుకుంటున్నాయి. ఇప్ప‌టికే 3 సార్లు దీనిపై ఆర్డినెన్సు జారీ చేసిన ఎన్‌డీఏ మ‌రోసారి చేయ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది.
ఇది వ్యూహాత్మ‌క‌మే!
వివాదాస్ప‌ద భూ బిల్లు ఆర్డినెన్స‌పై ప్ర‌ధాని వెన‌క్కి త‌గ్గ‌డం వ్యూహాత్మ‌క‌మేన‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఎందుకంటే లోక్‌స‌భ‌లో బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఉంది. పైగా మిత్ర‌ప‌క్షాలు ఉండ‌నే ఉన్నాయి. జ‌న‌తా ప‌రివార్, వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్, మ‌రికొన్ని పార్టీలు మాత్ర‌మే వ్య‌తిరేకిస్తున్నాయి. ఈ బిల్లు లోక్‌స‌భ‌లో సులువుగా ఆమోదం పొందుతుంది. ఇదివ‌ర‌కు ఒక‌సారి పొందింది కూడా. అయితే ఎటొచ్చి రాజ్య‌స‌భ‌లో వ‌చ్చింది చిక్కు. రాజ్య‌స‌భ శాశ్వ‌త స‌భ కావ‌డం, ఎన్‌డీఏకు అక్క‌డ మెజారిటీ త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల వెన‌క‌డుగు వేసింది. రెండేళ్ల‌లో కాంగ్రెస్ నామినేట్ చేసిన ఎంపీల ప‌ద‌వీకాలం తీరిపోనుంది. అప్పుడు బీజేపీ వంతు వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో ఈ అంశాన్ని మ‌రోసారి లేవ‌నెత్తితే బిల్లు సులువుగా ఆమోదం పొందుతుంది. అందుకే తాత్కాలికంగా బిల్లు, ఆర్డినెన్సుల‌ను వాయిదా వేసుకుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
First Published:  31 Aug 2015 12:25 AM GMT
Next Story