షూటింగ్ పూర్తిచేసుకున్నశివం

ఆమధ్య చేతికి గాయంతో కొన్నాళ్లు షూటింగులకు దూరంగా గడిపాడు హీరో రామ్. అయితే ఆ గాయం వెంటనే తగ్గిపోవడం, మళ్లీ ఈ కుర్రహీరో సెట్స్ పై హల్ చల్ చేయడం అన్నీ జరిగిపోయాయి. మరీ ముఖ్యంగా శివం సినిమాపై తన ఫోకస్ మొత్తం పెట్టాడు హీరో రామ్. ఇందులో భాగంగా ఈమధ్యే ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటల్ని విదేశాల్లో పూర్తిచేశారు. నార్వే, స్వీడన్ లలో తీసిన రెండు పాటలతో షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయిపోయింది. అంతేకాదు.. సినిమా విడుదల తేదీని కూడా తాజాగా ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న శివం సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు హీరో రామ్. ఈ విషయాన్ని తనే స్వయంగా తన ట్విట్టర్ పేజ్ ద్వారా వెల్లడించాడు. శ్రీనివాసరెడ్డి అనే కొత్త కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న్ ఈ సినిమాలో రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అభిమన్యుసింగ్ ఇందులో విలన్ గా కనిపిస్తాడు. 
Shivam Photo Gallery
[gmedia id=1248]