సూసైడ్ స్పాట్ కు వెళ్లిన సోనాక్షి సిన్హా!

ద‌బంగ్ చిత్రంతో  ద‌బంగ్ బ్యూటి అనిపించుకున్న  బీహార్  బేబి సోనాక్షి సిన్హా కు  ప్ర‌స్తుతం  మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా లేదు.   గ‌త యేడాది నుంచి త‌ను న‌టించిన చిత్రం ఏది  స‌క్సెస్ కాలేదు. దీంతో  ఈ ముద్దుగుమ్మ‌కు  కెరీర్ ప‌రంగా  ఒక మంచి స‌క్సెస్ కొట్టాల‌నే త‌పన  ఉంద‌న్న విష‌యం స‌న్నిహితుల‌కు తెలిసిందే.   తండ్రి  శ‌త్రుఘ్న సిన్హా ఏర్పాటు చేసిన ప్లాట్ ఫామ్ మీద  వ‌చ్చిన  సోనాక్షి..గ్లామ‌ర్ ప‌రంగా  బి టౌన్ కుర్ర కారు గుండెల్ని పిండేసింది.   ద‌క్షిణాది న  ర‌జ‌నీకాంత్ సర‌స‌న లింగా చిత్రంలో చేసి మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌స్తుతం   టాలెంటెడ్ డైరెక్ట‌ర్  మురగ దాసు ద‌ర్శ‌క‌త్వంలో    ఆకీరా అనే ఒక యాక్ష‌న్ డ్రామ్ ఫిల్మ్ చేస్తుంది. మ‌రి కెరీర్ ప‌రంగా త‌ను ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. అంత‌కు మించి  త‌న‌ను ఇబ్బంది పెట్టె స‌మ‌స్య‌లు  లేవు. మ‌రి ఎందుకు సోనాక్షి  సూయిసైడ్ స్పాట్ కు వెళ్లింది అనుకుంటున్నారా..?  సోనాక్షి లాంటి  డైన‌మిక్ లేడి  ఇటువంటి స్పాట్ కు వెళ్లింది అంటే..అదేదో ఒక టూరిస్ట్ స్పాట్ అయ్యింటుంది. 

 నిజ‌మే మ‌రి.. ఫ్రాన్స్ లో  గోల్డెన్ గేట్ అనే ఒక ప్రాంతం. ఇది ప్ర‌పంచంలో సూయిసైడ్ ల‌కు ప్ర‌సిద్ది.   ఇక్క‌డ నుంచి దూకి ప్రాణాల్ని తీసుక‌న్నా వాళ్ల సంఖ్య ఎక్కువుగానే ఉంది.   అయితే  సోనాక్షి ఈ మ‌ధ్య ఏదో సినిమా  షూటింగ్ కోసం  ఫ్రాన్స్ వెళ్లిన‌ప్పుడు.. గ్యాప్ లో     ఆ ప్లేస్ కు వెళ్లింద‌ట‌. అక్క‌డ నుంచి  కిందికి చూస్తే.. ఏదో తెలియ‌న భ‌యం వేసింద‌ట‌.   స‌ర‌ద‌గా త‌న ప‌క్క‌న వున్న  వాళ్లు దూకుతారా.. అని అడిగితే..  నో వే.. చ‌చ్చిన దూకను అని చెప్పింద‌ట‌.  ఇదండి మ‌న స‌ల్మాన్ హీరోయిన్  సూయిసైడ్ స్పాడ్  క‌హానీ..!