విష్ణు వ‌ర్సెస్ నానీ..!

ఈ శుక్ర‌వారం   ఇద్ద‌రు యంగ్ హీరోలు తమ‌ అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్ద‌మ‌య్యారు.   వారిలో   విష్ణు  డైన‌మైట్ అనే చిత్రంతో వ‌స్తుండ‌గా..  హీరో నానీ..  భ‌లే భ‌లే మ‌గాడివోయ్  చిత్రంతో వ‌స్తున్నాడు.   విష్ణు గ‌త యేడాది  దైనికైన రెడీ చిత్రం తో మెప్పించాడు. మ‌రి ఈ యేడాది ఇంత వ‌ర‌కు  బాక్సాఫీస్ వ‌ద్ద  త‌న కొత్త సినిమా ఏది ప‌డ‌లేదు.  అయితే లేటుగా వ‌చ్చినా..లేటెస్ట్ అన్న‌ట్లు..  డైన‌మైట్ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ తో వ‌స్తున్నాడు.  టైటిలే  ఇంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉండే.. సినిమాలో యాక్ష‌న్  ఎపిసోడ్స్  ఏ రేంజ్ లో  వుంటాయో అని ఊహించుకుంటున్నారు  ఫ్యాన్స్.  డైన‌మైట్ చిత్రంలో  ఫైట్స్ సీన్స్ కోసం  చాల జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడ‌ట హీరో విష్ణు.  స‌హ‌జంగా ఉండే  విధంగా  కంపోజ్ చేయించార‌ట‌. మ‌రి ప్ర‌చారం ప‌రంగా  ఒకింత  స్లో గా వున్న  డైన‌మైట్ చిత్రం..   ఏ రేంజ్ హిట్ కొడుతుందో  లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఇక ఒక మంచి హిట్ కోసం  పోరాడుతున్న   యువ హీరో నానీ.. ఈ సారి  త‌న రోటిన్ స్టైల్ కు భిన్నంగా  ..భ‌లే భ‌లే మ‌గాడివోయ్  అనే  వినోదాత్మ‌క చిత్రంతో  వ‌స్తున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం  కూడా  ఈ శుక్ర‌వారం రిలీజ్ అవుతుంది.  నానీ మొద‌టి సారి  హండ్రెట్ ప‌ర్సెంట్  కామెడి చేసిన ఈ చిత్రం  త‌న‌కు మంచి హిట్ ఇస్తుంద‌ని ఆశిస్తున్నాడు.    జెండా పై క‌పిరాజు..   ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం చిత్రాలు  ఈ యేడాది రిలీజ్ అయ్యాయి. న‌టుడిగా మంచి మార్కులే ప‌డ్డ‌ప్ప‌టికి..  క‌మ‌ర్షియ‌ల్ గా  స‌క్సెస్ మాత్రం రాలేదు.  అందుకే  ఈ సారి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రం పై  భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. మ‌రి ఒక వైపు  విష్ణు.. మ‌రో వైపు నానీ..  ఇద్ద‌రిలో  హిట్  హీరో అని  ఎవ‌రు అనిపించుకుంటారో..   లెట్స్ వెయింట్ అండ్ సీ.