Telugu Global
Others

సీఎం పీఠం కోసం జగన్‌వి పగటి కలలు: చంద్రబాబు

జగన్ పగటి కలలు మానుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హితవు చెప్పారు. జ్యోతిష్యుడు ఎవరో  జగన్‌కు మూడేళ్లలో ముఖ్యమంత్రి అవుతారని చెప్పారని, జగన్ ఆ భ్రమల్లో బతికేస్తున్నారని ఆయన ఎద్దేవా సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చొద్దని చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థికసంఘం ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. హోదా విషయంలో తమకు న్యాయం చేయాలని కేంద్రాన్ని […]

సీఎం పీఠం కోసం జగన్‌వి పగటి కలలు: చంద్రబాబు
X
జగన్ పగటి కలలు మానుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హితవు చెప్పారు. జ్యోతిష్యుడు ఎవరో జగన్‌కు మూడేళ్లలో ముఖ్యమంత్రి అవుతారని చెప్పారని, జగన్ ఆ భ్రమల్లో బతికేస్తున్నారని ఆయన ఎద్దేవా సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చొద్దని చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థికసంఘం ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. హోదా విషయంలో తమకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తరహాలో ఎదిగేవరకు సాయం చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించామని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. హోదాకు, పారిశ్రామిక అభివృద్దికి ఏమాత్రం సంబంధం లేదని, విపక్షనేత ఈ విషయం తెలుసుకోవాలని ఆయన కోరారు. విభజన చట్టంలోని అన్ని హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు బాబు తెలిపారు. రాజకీయ ఎత్తుగడలతో అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే బుద్ధి చెబుతారని జగన్‌ను ఉద్దేశించి బాబు వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు అనునిత్యం కృషి చేస్తానని, ఏపీ ప్రజలకు రక్షకుడిగా ఉంటానని చంద్రబాబు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడొద్దని, అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని ఆయన సూచించారు. అవసరమైతే ఢిల్లీకి తాము తీసుకెళతామని, వచ్చి కేంద్రం వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకుని మాట్లాడాలని ఆయన కోరారు.
First Published:  1 Sep 2015 3:30 AM GMT
Next Story