Telugu Global
Others

ఓటుకు నోటు కేసులో నేను సచ్ఛీలుడ్ని: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఓటుకు నోటు అంశంపై మాట్లాడారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం మరో రాష్ట్ర ప్రభుత్వంపై నిఘా పెట్టే పరిస్థితి రావడం దురదృష్టకరమని బాబు చెప్పారు. తన జీవితంలో ఏ తప్పు చేయలేదని, ధర్మం తన వైపు ఉందని ఆయన అన్నారు. తను ఎవరికీ భయపడనని, తనతో పెట్టుకున్న వారంతా ఏమయ్యారో మీకూ తెలుసని ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి చంద్రబాబు అన్నారు. ఈ సందర్బంగా జగన్‌ మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో 22సార్లు ఛార్జిషీటులో చంద్రబాబు […]

ఓటుకు నోటు కేసులో నేను సచ్ఛీలుడ్ని: చంద్రబాబు
X
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఓటుకు నోటు అంశంపై మాట్లాడారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం మరో రాష్ట్ర ప్రభుత్వంపై నిఘా పెట్టే పరిస్థితి రావడం దురదృష్టకరమని బాబు చెప్పారు. తన జీవితంలో ఏ తప్పు చేయలేదని, ధర్మం తన వైపు ఉందని ఆయన అన్నారు. తను ఎవరికీ భయపడనని, తనతో పెట్టుకున్న వారంతా ఏమయ్యారో మీకూ తెలుసని ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి చంద్రబాబు అన్నారు. ఈ సందర్బంగా జగన్‌ మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో 22సార్లు ఛార్జిషీటులో చంద్రబాబు పేరు ప్రస్తావించారని, ఇలాంటి వ్యక్తి నీతులు వల్లించడం వింతగా ఉందని జగన్‌ అన్నారు. దీనికి స్పందనగా చంద్రబాబు రెండు కొంటే ఒకటి ఫ్రీ అన్న చందంగా జైలుకెళ్లిన చరిత్ర మీదని ప్రతిపక్ష నేతనుద్దేశించి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పారు. తనపై విచారణ జరిపే అధికారం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎవరిచ్చారని చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఉమ్మడి రాజధానిలో ఒక ముఖ్యమంత్రిపై మరో ముఖ్యమంత్రి ఇలా చేయడానికి వెనుక ఈ జగన్‌ ఉన్నాడని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి, అభివృద్ధి నిరోధానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో చేతులు కలిపి దిగజారుడు తనానికి జగన్‌ ప్రయత్నించారని, దీనికి తమ వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ఙ హాజరేయించుకునే జగన్‌ తనపై ఆరోపణలు చేయడానికి సిగ్గు పడాలని ఆయన అన్నారు. జగన్‌, హరీష్‌రావు ఎక్కడ కలిశారో తనకు తెలుసునని, అనిల్‌కుమార్‌తో సహా ఎవరు ఎవరెవరిని కలిశారో తన వద్ద సమాచారం ఉందని ఆయన అన్నారు.
First Published:  1 Sep 2015 2:34 AM GMT
Next Story