Telugu Global
Others

మూతపడిన 92 యేళ్ళ గీతా ప్రెస్‌

హిందూ సంప్రదాయాల్ని కాపాడుతూ దాదాపు వందేళ్ళ చరిత్రను లిఖించుకున్న గీతా ప్రెస్‌ మూతపడింది. 92 సంవత్సరాలుగా నిరాటంకంగా భారతీయ సాంస్కృతిక కళాశాలగా, సంస్కృతీ భాండాగారంగా దీనికి పేరుంది.  “గీతా ప్రెస్”గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రెస్ సగాని కన్నా తక్కువ ధరకే నాణ్యమైన పుస్తకాలను అందించేది. కలకత్తాకు చెందిన ‘గోవింద్ భవన్ ట్రస్ట్’ నిర్వహిస్తున్న ఈ ప్రెస్ కార్మికులకు వేతనాలు చెల్లించ లేని దుస్థితికి చేరుకుంది. “భగవద్గీత” మరియు “రామచరిత మానస్” మొదలైన అనేక […]

మూతపడిన 92 యేళ్ళ గీతా ప్రెస్‌
X
హిందూ సంప్రదాయాల్ని కాపాడుతూ దాదాపు వందేళ్ళ చరిత్రను లిఖించుకున్న గీతా ప్రెస్‌ మూతపడింది. 92 సంవత్సరాలుగా నిరాటంకంగా భారతీయ సాంస్కృతిక కళాశాలగా, సంస్కృతీ భాండాగారంగా దీనికి పేరుంది.
“గీతా ప్రెస్”గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రెస్ సగాని కన్నా తక్కువ ధరకే నాణ్యమైన పుస్తకాలను అందించేది. కలకత్తాకు చెందిన ‘గోవింద్ భవన్ ట్రస్ట్’ నిర్వహిస్తున్న ఈ ప్రెస్ కార్మికులకు వేతనాలు చెల్లించ లేని దుస్థితికి చేరుకుంది. “భగవద్గీత” మరియు “రామచరిత మానస్” మొదలైన అనేక విలువైన పుస్తకాలను ఇంటింటికీ చేర వేసిన ఘనత గీతా ప్రెస్‌కే దక్కుతుంది. గీతా ప్రెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోయి ఉంటే మనం భగవద్గీతను వెయ్యి రూపాయలు పైగా వెచ్చించి కొనాల్సి వచ్చేది. గీతా ప్రెస్ ముద్రించిన పుస్తకాలలో ఎటువంటి అసభ్యత ఉండదు. ఒకవేళ ఎవరైనా గీతా ప్రెస్‌ పుస్తకాల్లో అసభ్యత ఉన్నట్టు గుర్తిస్తే తగిన పారితోషికం ఇస్తామని సవాల్ చేస్తూ ఈ సంస్థ ప్రచురణ సాగించిందంటే ఎంత నిబద్దతతో పని చేసేదో అర్ధం చేసుకోవచ్చు. గీతా ప్రెస్‌లో ఎటువంటి ప్రకటనలుగాని, జీవించి ఉన్న వ్యక్తుల ఫోటోలుగానీ ముద్రించరు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా ఈ ప్రెస్‌ ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. అంటే న్యూస్‌ప్రింట్‌ను కూడా తీసుకోకుండా సొంత ఖర్చులతో నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. అలాంటి గీతా ప్రెస్‌ ఇక లేదంటే బాధ కలగక తప్పదు.
First Published:  31 Aug 2015 1:11 PM GMT
Next Story