Telugu Global
NEWS

కేబినెట్‌ తీర్మానాలతోనే 11 రాష్ట్రాలకు హోదా: జగన్‌

కేంద్రంలో ఇంతకుముందు అధికారంలో ఉన్న యుపిఎ మంత్రివర్గం ఐదేళ్ళపాటు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించి అమలు చేయాల్సిందిగా ప్రణాళికా సంఘానికి పంపారని, ఆ తర్వాత ఏడు నెలలుపాటు దాని ముఖం చూసినవాళ్ళు ఎవరూ లేరని… ఇలాగైతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వై.ఎస్‌. జగన్‌ ప్రశ్నించారు. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయంతోనే ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక తరహా కేటగిరి ఇచ్చిందని, ఆ తర్వాత ప్రణాళిక సంఘం, ఎన్.డి.సి. రాటిఫై చేశాయని […]

కేబినెట్‌ తీర్మానాలతోనే 11 రాష్ట్రాలకు హోదా: జగన్‌
X
కేంద్రంలో ఇంతకుముందు అధికారంలో ఉన్న యుపిఎ మంత్రివర్గం ఐదేళ్ళపాటు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించి అమలు చేయాల్సిందిగా ప్రణాళికా సంఘానికి పంపారని, ఆ తర్వాత ఏడు నెలలుపాటు దాని ముఖం చూసినవాళ్ళు ఎవరూ లేరని… ఇలాగైతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వై.ఎస్‌. జగన్‌ ప్రశ్నించారు. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయంతోనే ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక తరహా కేటగిరి ఇచ్చిందని, ఆ తర్వాత ప్రణాళిక సంఘం, ఎన్.డి.సి. రాటిఫై చేశాయని జగన్ చెప్పారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కేవలం మంత్రివర్గ తీర్మానాలతోనే ఇస్తే… ఏపీకి వచ్చేసరికి 14వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్‌ అంటూ రకరకాల కారణాలు చెబుతున్నారని… పైగా ఇప్పుడు ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాని తమ ఎం.పి. సుబ్బారెడ్డి వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ఉపసంహరించడం లేదని తెలిపారని, అంటే దానర్ధం ప్రత్యేక హోదా కొనసాగుతున్నట్టే కదా అన్నారు. కాని జగన్ ఇంకా ఏదో చెప్పబోతుండగా చంద్రబాబు అడ్డు తగిలారు. జగన్ మాటల్లో సాధికారత లేదని, ఆయన చెబుతున్న సమాచారం మదుకర్ అనే వ్యక్తి నడుపుతున్న సంస్థ తయారు చేసిన డాక్యుమెంట్ అని అన్నారు. ఢిల్లీలో మిమ్మల్ని బోల్తా కొట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటినుంచి బయటపడి ఎపికి ఉపయోగపడేలా మాట్లాడాలని కోరుతున్నానని చంద్రబాబు అన్నారు. యనమల జోక్యం చేసుకుంటూ జగన్ చెప్పేది వింటే పిల్లిని చంకన పెట్టుకున్నట్లేనని అన్నారు.
First Published:  1 Sep 2015 6:26 AM GMT
Next Story