Telugu Global
Others

హోదా తెస్తానంటే రాజీనామాలకు రెడీ: జేసీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకువస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి హామీ ఇస్తే పది మంది ఎంపీలం రాజీనామా చేస్తామని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సవాల్ చేసారు. అసెంబ్లీలో ఏపీకి ప్రత్యేక హోదాపై జగన్ చేసిన వ్యాఖ్యాలపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మా రాజీనామా తర్వాత కూడా జగన్ ప్రత్యేక హోదా తీసుకురాకపోతే… ఏకగ్రీవంగా మమ్మల్ని లోక్‌సభకు పంపుతారా? అని జేసీ దివాకర్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రులు […]

హోదా తెస్తానంటే రాజీనామాలకు రెడీ: జేసీ
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకువస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి హామీ ఇస్తే పది మంది ఎంపీలం రాజీనామా చేస్తామని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సవాల్ చేసారు. అసెంబ్లీలో ఏపీకి ప్రత్యేక హోదాపై జగన్ చేసిన వ్యాఖ్యాలపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మా రాజీనామా తర్వాత కూడా జగన్ ప్రత్యేక హోదా తీసుకురాకపోతే… ఏకగ్రీవంగా మమ్మల్ని లోక్‌సభకు పంపుతారా? అని జేసీ దివాకర్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రులు కాదు.. సీఎం రాజీనామా చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాకపోతే బీహార్ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్‌కు మంచి ప్యాకేజీ వస్తుందని, ఆర్థికంగా ఎక్కువ లాభం చేకూరుతుందని జేసీ దివాకర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
First Published:  31 Aug 2015 1:19 PM GMT
Next Story