Telugu Global
Others

ఉరిశిక్ష రద్దుకు లా కమిషన్‌ సిఫార్సు

ఉరిశిక్షను రద్దు చేయాలని జాతీయ లా కమిషన్‌ సిఫార్సు చేసింది. అయితే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే తీవ్రవాదుల విషయంలో దీనికి మినహాయింపు ఇచ్చింది. లా కమిషన్‌ ఛైర్మన్‌, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎపి షా ఈ విషయాన్ని వెల్లడించారు. కమిషన్‌లో ఉన్న సభ్యుల్లో ముగ్గురు ఉరిశిక్ష ఉండాలని, ఆరుగురు ఉరిశిక్ష రద్దు చేయాలని భావించారు. దీని అమలుపై పార్లమెంటులో చర్చ జరగాలని కమిషన్‌ సూచించింది. ఉరిశిక్ష రద్దును వెంటనే అమలు చేయాలని కోరటం […]

ఉరిశిక్ష రద్దుకు లా కమిషన్‌ సిఫార్సు
X
ఉరిశిక్షను రద్దు చేయాలని జాతీయ లా కమిషన్‌ సిఫార్సు చేసింది. అయితే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే తీవ్రవాదుల విషయంలో దీనికి మినహాయింపు ఇచ్చింది. లా కమిషన్‌ ఛైర్మన్‌, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎపి షా ఈ విషయాన్ని వెల్లడించారు. కమిషన్‌లో ఉన్న సభ్యుల్లో ముగ్గురు ఉరిశిక్ష ఉండాలని, ఆరుగురు ఉరిశిక్ష రద్దు చేయాలని భావించారు. దీని అమలుపై పార్లమెంటులో చర్చ జరగాలని కమిషన్‌ సూచించింది. ఉరిశిక్ష రద్దును వెంటనే అమలు చేయాలని కోరటం లేదని స్పష్టం చేసింది. కొన్ని అసాధారణ కేసుల్లో కేసు తీవ్రత దృష్ట్యా రాజ్యాంగ పరిధి దాటి వ్యవవహరించరాదని తెలిపింది. మత విశ్వాసాలను నియంత్రించటానికి చేపట్టే చర్యలు ప్రతీకారానికి దారి తీసే విధంగా ఉండకూడదని, ఉరిశిక్ష విషయంలో దీనిని గుర్తించాలని సూచించింది. నేషనల్‌ లా యూనివర్సిటీకి చెందిన డెత్‌ పెనాల్టీ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ లెక్కల ప్రకారం స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పటివరకు 1,414 మందికి ఉరిశిక్ష అమలు చేశారు. 1998 నుంచి నలుగురికి ఈ శిక్ష విధించారు. చివరగా యాకూబ్‌ మెమన్‌ను ఈ ఏడాది జూలై 30న నాగపూర్‌లోని సెంట్రల్‌ జైల్‌లో ఉరితీశారు.
First Published:  31 Aug 2015 1:14 PM GMT
Next Story