Telugu Global
Others

ఆకాశవాణి వద్ద 9 లక్షల గంటల రికార్డులు!

ఆకాశవాణి వద్ద 9 లక్షల గంటల రికార్డులుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడి అన్నారు. ఇది పరిశోధకులకు ఎంతోగానో ఉపయోగపడుతుందని, ప్రతి యూనివర్శిటీ నుంచి ప్రతి సంవత్సరం ఒక్కరైనా ఆకాశవాణి కార్యక్రమాల మీద పరిశోధన చేస్తే భావి తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. రామచరిత మానస్ డిజిటల్ వర్షన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ భారత కుటుంబ విలువలకు రామచరితమానస్ పట్టం కడుతుందన్నారు. డిజిటలైజేషన్ కార్యక్రమంలో పాలుపంచుకున్న […]

ఆకాశవాణి వద్ద 9 లక్షల గంటల రికార్డులు!
X
ఆకాశవాణి వద్ద 9 లక్షల గంటల రికార్డులుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడి అన్నారు. ఇది పరిశోధకులకు ఎంతోగానో ఉపయోగపడుతుందని, ప్రతి యూనివర్శిటీ నుంచి ప్రతి సంవత్సరం ఒక్కరైనా ఆకాశవాణి కార్యక్రమాల మీద పరిశోధన చేస్తే భావి తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
రామచరిత మానస్ డిజిటల్ వర్షన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ భారత కుటుంబ విలువలకు రామచరితమానస్ పట్టం కడుతుందన్నారు. డిజిటలైజేషన్ కార్యక్రమంలో పాలుపంచుకున్న బృందాన్ని ఆయన అభినందించారు. 1980లో ఆకాశవాణి భోపాల్ కేంద్రంలో 14 మంది సంగీతకారుల సహకారంతో రామచరితమానస్ రికార్డ్ చేశారు. ఆకాశవాణి డిజిటలైజేషన్ ప్రక్రియ ఎందరికో స్ఫూర్తినిస్తుందని ప్రధాని చెప్పారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
First Published:  31 Aug 2015 1:08 PM GMT
Next Story