Telugu Global
Others

సీఆర్‌డీఏ చట్టంపై పిటిషన్‌ కొట్టివేత 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్‌డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు, జస్టిస్‌ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషన్‌ విచారణకు వచ్చిన వెంటనే దాన్ని పరిశీలించిన జస్టిస్‌ దత్తు హైకోర్టుకు వెళ్లాలని సూచించారు.‘మాకంటే ఎక్కువ అధికారాలు హైకోర్టుకు ఉంటాయి’అని వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాది అనిల్‌ కుమార్‌ ఝా కల్పించుకొని వాదనలు వినడానికి సమయమివ్వాలని కోరగా, ధర్మాసనం అనుమతించింది. […]

సీఆర్‌డీఏ చట్టంపై పిటిషన్‌ కొట్టివేత 
X
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్‌డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు, జస్టిస్‌ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషన్‌ విచారణకు వచ్చిన వెంటనే దాన్ని పరిశీలించిన జస్టిస్‌ దత్తు హైకోర్టుకు వెళ్లాలని సూచించారు.‘మాకంటే ఎక్కువ అధికారాలు హైకోర్టుకు ఉంటాయి’అని వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాది అనిల్‌ కుమార్‌ ఝా కల్పించుకొని వాదనలు వినడానికి సమయమివ్వాలని కోరగా, ధర్మాసనం అనుమతించింది. దాదాపు 20 నిమిషాల పాటు న్యాయవాది వాదనలు వినిపించారు.
First Published:  31 Aug 2015 1:06 PM GMT
Next Story