బస్సు లోయలో పడి 18మంది దుర్మరణం

హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారత్-టిబెట్ జాతీయ రహదారిపై నథాపాలోని గార్గ్ వద్ద 30 మందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు మంగళవారం అదుపు తప్పి 200 మీటర్ల లోతు ఉన్న లోయలో పడిపోయింది. దీంతో అక్కడికక్కడే 15 మంది మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయినట్లు కిన్నౌర్ ఎస్పీ రాహుల్‌నాథ్ తెలిపారు.